పుట:PadabhamdhaParijathamu.djvu/155

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆల_____ఆల 129 ఆల_____ఆలి

హఠాత్తుగా ఆయనభార్య చనిపోయిందట. అంతా ఆలగోడూ బాలగోడుగా ఉంది." వా. ఆలనా పాలనా లేదు

 • చూచేవా రెవరూ లే రనుట.
 • "ఆతోట ఆలనా పాలనా లేక పాడయి పోయింది." వా.

ఆపపాడి

 • పాలిచ్చు ఆవులకలిమి.
 • మేకపాడి వంటిది. పాండు. 2. 111.

ఆల బేల

 • అమాయకురాలు. జం.
 • "ఆలపు బేలపు కడు గొమరాలవు..." కుమా.

ఆలము చేయు

 • ఉపేక్ష చేయు.
 • "అని పలుకు నమ్మరాళలోలనయన పలుకు లాలంబు సేసి చక్రవాకి యిట్లనియె." మను. 6. 68.

ఆలము సేయు

 • వ్యర్థపఱచు, గాయపఱచు.
 • "కూర్మి యెల్ల నే డాలము సేసి." కుమా. 11. 55.

ఆలవట్ట మిడు

 • గుడ్డతో గుండ్రముగా కూర్చిన విసనకఱ్ఱతో వీచు. ఇప్పటికీ దేవాలయాలలో దేవునిముందు ఊరేగింపులలో పట్టుకొని పోతారు. వీని పిడికఱ్ఱ చాలా పొడవుగా ఉంటుంది.
 • "మృగాక్షు లాలవట్టంబు లిడ." భార. స్త్రీ. 2. 38.

ఆలవట్టము

 • వస్త్రంతో గుండ్రంగా తయారుచేసిన విసనకఱ్ఱ; ఆలయోత్సవాలలో, రాజోపచారాలలో ఉపయోగించే గుడ్డ గొడుగు.
 • "ఆలవట్టములు జామరులు...."
 • పండితా. ప్రథ. వాద. పుట. 518.
 • "మృగాక్షు లాలవట్టంబు లిడ..." భార. స్త్రీ. 2. 38.
 • "కమలదళము మృణాళకాండమున జెర్చి, యాలవట్టంబు గావించి లీల మెఱయ, విసరు-" నిర్వ. 8. 62.
 • "అచ్చరవిరిజోడు లాలవట్టము లూన, విను టెంకిచెలులు వీవనలు వైవ." అచ్చ. సుంద. 35.

ఆలించి విను

 • శ్రద్ధగా విను, సావధానంగా విను.
 • "రతిరోదనధ్వని వసంతకు చెవులం జిలికిన నులికిపడి యద్దెస యాలించి విని." కుమా. 5. 87.

ఆలిగొను

 • పరిహసించు.
 • "అకట! సైరంధ్రి నన్ను నిట్లాలి గొనగ, నేల." భార. విరా. 4. 18.
 • చూ. ఆలిబుచ్చు.

ఆలిబుచ్చు

 • పరిహసించు.
 • చూ. ఆలిగొను.