పుట:PadabhamdhaParijathamu.djvu/156

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆలి______ఆలె 130 ఆలే______ఆళ

ఆలిసేయు

 • వ్యర్థము చేయు.
 • "శూలి చేసినతప మెల్ల నాలి సేసె." కుమా. 4. 409.

ఆలూ చూలూ లేదు

 • భార్యాపిల్లలు లేరు.
 • కాస్త నిరసనగా వానికి యేమీ లేదు అనుపట్ల ఉపయోగిస్తారు.
 • "ఆలూ చూలూ లేనివా ణ్ణెవడు నమ్ముతారు రా?" వా.

ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం

 • అస లింకా ఆరంభం కాక ముందే ఫలితాన్ని గూర్చి ఉవ్విళ్లూరేపట్ల ఉపయోగించే పలుకుబడి.
 • "ఉద్యోగానికి దరఖాస్తు పెట్టావో లేదో అప్పుడే యింక్రిమెంటు లెక్క వేస్తున్నా వేమిట్రా? ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నాట్ట." వా.

ఆలెగాడు

 • నౌకరు. శ,ర.
 • ఆయగాడు అనే వాడుకలో వినబడుతుంది.

ఆలె(ల)పొయ్యి

 • స్నా నానికి నీళ్లు కాచు పొయ్యి. దీన్ని సామాన్యంగా ఒక బిందో కాగో పెట్టి చుట్టూ కట్ట కట్టివేసి ఉంటారు. ఆ బిందె తీయుటకు రాదు. దానిని ఆలపొయ్యి అని నేడు అంటారు.

ఆలేకార్లు

 • అధికారులు, ఆఫీసర్లు.
 • నిత్యబహువచనము.
 • "సర్కారు సిబ్బంది సరి చేయుటకు గొంత, సాలు జమాబందిపాలు గొంత, పొరుగూరి మన్నీల సరఫరా కింత యా, లేకార్ల లంచాలలోకి కొంత... కొంత కొంతయె ఖర్చు కొండంత యయ్యె." పెన్నే. 2.

ఆలోకనవిద్య

 • ఇంద్రజాలము.

ఆళ(ల)తి సేయు

 • ఝంకారము చేయు (తుమ్మెదల విషయంలోనే ఈ పదం కనబడుతుంది) అందుతో పాట పాడు, ఆలపించు అన్నట్లు మారింది.

          "ఆడెడు నమ్మి గనొనకు మమ్మ బయ
           ల్పడ నాడుచిల్కతో, నాడకు మమ్మ,
           తేటిగెడ నాళతి సేయకు మమ్మ."
                                    కుమా. 5. 131.

         "సోలుచు సమ్మదరసముం, గ్రోలుచు,
           వనపాల బాలికలు నవలతికాం, దోల
           ముల వేడ్క సలుపుచు, నాళతు లొగి
           జేసి పాడి రభినవలీలన్."
                                  కుమా. 4. 112.

         "కో, యిలల యెలుంగు లోలి గొని
          యింపుగ జిల్కలతోడ నెమ్మిమై, నల
          వడి మాటలాడి యళు లాలతి సేయగ
          బాడి డాగురిం, తలు హరితోడ నాడు
          దురు తద్వనవీధులయందు గోపికల్."
                                 హరి. పూ. 8.35.