ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఆరూ_____ఆర్చి 127 ఆర్చి_____ఆర్ప
ఆరూ పోరూ
- పోరుట, గోకుట. జం.
- ముఖ్యంగా అత్తింటివారిపోరు.
- "ఆవిడది ఆరూ పోరూ లేనిసంసారం." వా.
ఆరూ మూడూ అట్లపిండి అగు
- చెడిపోవు అనే అర్థంలో ఉపయోగించే పలుకుబడి.
- "ఆపని అంతా ఆరూ మూడూ అట్లపిండి అయిపోయింది." వా.
ఆరోగణము
- భోజనము (కన్నడం - ఆరోగణ) నై వేద్యము.
- చూ. ఆరోగిణము.
- "హరునకు నిత్యంబు గరికాలచోడ నరపతి యారోగణము నెమ్మి జలుప బలకల నేఱినప్రాసంగుంబ్రాలు..."
- బస. 5. 143 పుట.
ఆరోగ్యం మహాభాగ్యం
- ఆరోగ్యం మొదట చూచు కోవాలి అని చెప్పవలసి వచ్చినపుడు అనేమాట.
- "మరీ అంత రాత్రింబవళ్లు పని చేస్తే ఎట్లా రా? ఒళ్లు చెడదూ? ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు." వా.
ఆరోగ్యస్నానం
- జబ్బుపడి లేచిన తర్వాత చేసే మొదటి స్నానం.
- "నిన్న నే ఆరోగ్యస్నాం చేశావు. అప్పుడే బయటికి ఎందుకు వెడతావు బాబూ!" వా.
ఆర్చి తేళ్ళ దలబెట్టు
- అనవసరంగా బాధించు, గుట్టు బయట బెట్టు.
- "ఏల చలంబు నీ వడిగెదేని వచించెద నాదు గోప్యమున్, బేలవె యార్చి తేళ్ల దలబెట్ట..." ప్రభా. 3. 147.
ఆర్చి పేర్చి
- సింహనాదం చేసి, విజృంభించి.
- "ఆర్చి పేర్చి మారు డారీతి సేయంగ." చంద్ర. విలా. 2. 42.
ఆర్చు తీర్చు
- ఊరార్చు.
- "ఆర్పగ దీర్పగ మిక్కిలి, నేర్పు గలవయస్యలట్లు నెలతయు మీ మీ, నేర్పున బలికెద రక్కఱ, యేర్పడ మీ కీ విచార మేటికి జెపుడా." ఆము. 5. 65.
ఆర్చెదో తీర్చెదో
- ఆరుస్తావా తీరుస్తావా? నీకు చెప్పీ యేమి ప్రయోజనం అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
- "ఆర్చెదొ తీర్చెదో తెలుప నయ్యెడి దేమి?" సారం. 3. 184.
- చూ. ఆరుస్తావా తీరుస్తావా?
ఆర్చేవారా తీర్చేవారా?
- ది క్కెవరూ లే రనుట.
- "ఏదో అవస్థ పడుతున్నాను. ఎవరితో చెప్పుకొని ఏం లాభం? ఆర్చేవారా? తీర్చేవారా?" వా.
ఆర్పగ దీర్పగ
- ఆర్చుటకూ తీర్చుటకూ సమర్థమైన.
- "ఆర్పగ దీర్పగ మిక్కిలి నేర్పుగలవయస్యు డట్లు." ఆము. 5. 65.