పుట:PadabhamdhaParijathamu.djvu/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆరూ_____ఆర్చి 127 ఆర్చి_____ఆర్ప

ఆరూ పోరూ

  • పోరుట, గోకుట. జం.
  • ముఖ్యంగా అత్తింటివారిపోరు.
  • "ఆవిడది ఆరూ పోరూ లేనిసంసారం." వా.

ఆరూ మూడూ అట్లపిండి అగు

  • చెడిపోవు అనే అర్థంలో ఉపయోగించే పలుకుబడి.
  • "ఆపని అంతా ఆరూ మూడూ అట్లపిండి అయిపోయింది." వా.

ఆరోగణము

  • భోజనము (కన్నడం - ఆరోగణ) నై వేద్యము.
  • చూ. ఆరోగిణము.
  • "హరునకు నిత్యంబు గరికాలచోడ నరపతి యారోగణము నెమ్మి జలుప బలకల నేఱినప్రాసంగుంబ్రాలు..."
  • బస. 5. 143 పుట.

ఆరోగ్యం మహాభాగ్యం

  • ఆరోగ్యం మొదట చూచు కోవాలి అని చెప్పవలసి వచ్చినపుడు అనేమాట.
  • "మరీ అంత రాత్రింబవళ్లు పని చేస్తే ఎట్లా రా? ఒళ్లు చెడదూ? ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు." వా.

ఆరోగ్యస్నానం

  • జబ్బుపడి లేచిన తర్వాత చేసే మొదటి స్నానం.
  • "నిన్న నే ఆరోగ్యస్నాం చేశావు. అప్పుడే బయటికి ఎందుకు వెడతావు బాబూ!" వా.

ఆర్చి తేళ్ళ దలబెట్టు

  • అనవసరంగా బాధించు, గుట్టు బయట బెట్టు.
  • "ఏల చలంబు నీ వడిగెదేని వచించెద నాదు గోప్యమున్, బేలవె యార్చి తేళ్ల దలబెట్ట..." ప్రభా. 3. 147.

ఆర్చి పేర్చి

  • సింహనాదం చేసి, విజృంభించి.
  • "ఆర్చి పేర్చి మారు డారీతి సేయంగ." చంద్ర. విలా. 2. 42.

ఆర్చు తీర్చు

  • ఊరార్చు.
  • "ఆర్పగ దీర్పగ మిక్కిలి, నేర్పు గలవయస్యలట్లు నెలతయు మీ మీ, నేర్పున బలికెద రక్కఱ, యేర్పడ మీ కీ విచార మేటికి జెపుడా." ఆము. 5. 65.

ఆర్చెదో తీర్చెదో

  • ఆరుస్తావా తీరుస్తావా? నీకు చెప్పీ యేమి ప్రయోజనం అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "ఆర్చెదొ తీర్చెదో తెలుప నయ్యెడి దేమి?" సారం. 3. 184.
  • చూ. ఆరుస్తావా తీరుస్తావా?

ఆర్చేవారా తీర్చేవారా?

  • ది క్కెవరూ లే రనుట.
  • "ఏదో అవస్థ పడుతున్నాను. ఎవరితో చెప్పుకొని ఏం లాభం? ఆర్చేవారా? తీర్చేవారా?" వా.

ఆర్పగ దీర్పగ

  • ఆర్చుటకూ తీర్చుటకూ సమర్థమైన.
  • "ఆర్పగ దీర్పగ మిక్కిలి నేర్పుగలవయస్యు డట్లు." ఆము. 5. 65.