పుట:PadabhamdhaParijathamu.djvu/152

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆరు______ఆరు 126 ఆరు______ఆరు

వంచనాపాటవంబున గొంచు బోయి యారివేరంబు చేసినకారణమున." కాశీ. 5. 68. ఆరుదూఱు

 • అల్లరి, నింద.
 • "వాడు ఆరుదూఱు చేసెనే." క్షేత్రయ్య.
 • "వారక యత్తగారికనుబ్రామి నిజేశ్వరు మోసపుచ్చి యే, యారును దూఱు నైన బడి యెందఱు... కోరిననాథునిం గలిసి కొల్లలుగా సుఖ మంద రన్న." అహల్యా. 3. 33.
 • "వారి కెవ్వారికి లేనియారుదూఱు నీ తలనె వ్రాసెనే ధాత." అహల్యా. 3. 46.

ఆరు నూరయినా నూరు ఆరయినా...

 • ఏది ఏమయినా అనుట.
 • "ఆరునూ రయిన వెనుకాడను." రుద్రమ. 42 పు.
 • "ఆరు నూరయినా నూరు ఆరయినా యీ పెళ్లి జరిగి తీరవలసిందే." వా.

ఆరునెలలు బేరము

 • త్వరగా తెమలనిది.
 • "వాణ్ణి పిలుచుకొనిపోతే యీ పని తెములుతుందా? వాడి దంతా ఆరు నెలల బేరం." వా.

ఆరున్నొకటి

 • ఏడు.
 • ఏడు అనుట అమంగళసూచక మని కొలచడం, తూచడం వగైరాలలో ఆరున్నొకటి అనడం వాడుక.

ఆరున్నొక్కరాగం తీయు

 • ఏడ్చు.
 • "మా అబ్బాయి అప్పుడు ఆరునొక్క క్క రాగం తీశాడు." వా.
 • చూ. ఆరునొక్క రాగం లంకించు కొను.

ఆరునొక్కరాగం లంకించుకొను

 • చూ. ఆరునొక్క రాగం తీయు.

ఆరుబత్తుల కంపెనీ

 • దివాలాకోరు ముఠా.
 • అర్బత్ నాట్ కంపెనీ దివాలా తీయడం ప్రసిద్ధం. అందుపై తరువాత యేర్పడిన పలుకుబడి.

ఆరుమూడు చేయు

 • పని చెడగొట్టు.
 • కలువాయి. 29.

ఆరు మూడైనా మూడు ఆరైనా

 • ఏమైనా సరే అనుట.
 • "ఆరు మూడైనా మూడు ఆరైనా ఆ ఊరికి నేను ఈ రాత్రి వెళ్ళడం తప్పదు." వా.
 • చూ. ఆరునూరయినా నూరుఆరయినా.

ఆరుస్తావా తీరుస్తావా ?

 • నీ కెందుకు ఈ సంగతి అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
 • "నీ కెందుకులే అవన్నీ. నీ వేం ఆరుస్తావా? తీరుస్తావా?" వా.
 • చూ. ఆర్చెదొ తీర్చెదో.