ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఆర_______ఆరి 125 ఆరి_______ఆరి
ఆరట పెట్టు
- కష్ట పెట్టు.
- ఆరటం ఆరాటం అన్న రూపంలో నేటికీ వాడుకలో వినవస్తుంది.
- పాండు. 4. 289.
- "వాళ్లు తల్లులూ పిల్లలూ ఎంత ఆరాటపడి పోతున్నారో చెప్పలే మమ్మా!"
- "ఏమిట్రా ఆ ఆరాటం! కాసేపు ఆగు." వా.
ఆరడిబోవు
- వ్యర్థ మగు.
- "రాముని కార్య మారడి బోయె." వర. రా. కిష్కి. పు. 501 పంక్తి 1.
ఆరడుగుల నేల
- చూ. అయిదుమూళ్ల నేల.
ఆరబండు
- కలమాగు.
- "ఒకమాన నారబండిన పండ్లు." భార. శాంతి. 1. 160.
ఆరబట్టు
- నిందించు, కడిగి ఆరవేయు.
- "బ్రాహ్మణమత మారబట్టు ములుచ." నాయకు. 15 పు.
- చూ. ఉతికి ఆరవేయు.
ఆరాటపడు
- ఆవేదన చెందు.
- "మన సారాటపడం జేసి కాని రా దుడి గింపన్." కేయూ. 2. 37.
ఆరింద
- ఆరితేరిన ఆడది, నెఱజాణ.
- జగ. 41.
- "ఆపిల్ల్స్ ఏదో ఆరిందాలా మాట్లాడుతుంది." వా.
- చూ. ఆరిందా.
ఆరిందా గోవిందా అయినట్లు
- సమర్థునకే శాస్తి అయ్యె ననుట.
ఆరితేరిన ఘటం
- గడుసరి.
- "వాడు ఇందులో బాగా ఆరితేరిన ఘటం. వాడిదగ్గర నీ ఆట లేమీ సాగవు." వా.
ఆరితేరు
- గడిదేరు. డక్కా మొక్కీలు తిను.
- "హరుకంటి సెగ కోర్చి యారి తేరిన మారుడు." విజయ. 3. 25.
ఆరినపుండ్లు కోలలను గెలికిన క్రియ
- మఱచినబాధను తిరిగీ జ్ఞప్తికి తెచ్చుపట్ల అనే సామ్యం. మానిపోయిన పుండును సూదితో కెలికినట్లు.
- పండితా. ద్వితీ. మహి. పుట 169.
ఆరివేరము
- కలహప్రియత్వము.
- "గగనముననుండి వచ్చె నాకస్మికముగ నారివేరంపుదపసి దైత్యారికడకు." పారి. 1 ఆ.
ఆరివేరము చేయు
- గందరగోళము చేయు.
- "..... తల్లియస్థుల కొకమాట పాపకర్ముండు చెం చర్థభార మనుచు