పుట:PadabhamdhaParijathamu.djvu/151

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆర_______ఆరి 125 ఆరి_______ఆరి

ఆరట పెట్టు

 • కష్ట పెట్టు.
 • ఆరటం ఆరాటం అన్న రూపంలో నేటికీ వాడుకలో వినవస్తుంది.
 • పాండు. 4. 289.
 • "వాళ్లు తల్లులూ పిల్లలూ ఎంత ఆరాటపడి పోతున్నారో చెప్పలే మమ్మా!"
 • "ఏమిట్రా ఆ ఆరాటం! కాసేపు ఆగు." వా.

ఆరడిబోవు

 • వ్యర్థ మగు.
 • "రాముని కార్య మారడి బోయె." వర. రా. కిష్కి. పు. 501 పంక్తి 1.

ఆరడుగుల నేల

 • చూ. అయిదుమూళ్ల నేల.

ఆరబండు

 • కలమాగు.
 • "ఒకమాన నారబండిన పండ్లు." భార. శాంతి. 1. 160.

ఆరబట్టు

 • నిందించు, కడిగి ఆరవేయు.
 • "బ్రాహ్మణమత మారబట్టు ములుచ." నాయకు. 15 పు.
 • చూ. ఉతికి ఆరవేయు.

ఆరాటపడు

 • ఆవేదన చెందు.
 • "మన సారాటపడం జేసి కాని రా దుడి గింపన్." కేయూ. 2. 37.

ఆరింద

 • ఆరితేరిన ఆడది, నెఱజాణ.
 • జగ. 41.
 • "ఆపిల్ల్స్ ఏదో ఆరిందాలా మాట్లాడుతుంది." వా.
 • చూ. ఆరిందా.

ఆరిందా గోవిందా అయినట్లు

 • సమర్థునకే శాస్తి అయ్యె ననుట.

ఆరితేరిన ఘటం

 • గడుసరి.
 • "వాడు ఇందులో బాగా ఆరితేరిన ఘటం. వాడిదగ్గర నీ ఆట లేమీ సాగవు." వా.

ఆరితేరు

 • గడిదేరు. డక్కా మొక్కీలు తిను.
 • "హరుకంటి సెగ కోర్చి యారి తేరిన మారుడు." విజయ. 3. 25.

ఆరినపుండ్లు కోలలను గెలికిన క్రియ

 • మఱచినబాధను తిరిగీ జ్ఞప్తికి తెచ్చుపట్ల అనే సామ్యం. మానిపోయిన పుండును సూదితో కెలికినట్లు.
 • పండితా. ద్వితీ. మహి. పుట 169.

ఆరివేరము

 • కలహప్రియత్వము.
 • "గగనముననుండి వచ్చె నాకస్మికముగ నారివేరంపుదపసి దైత్యారికడకు." పారి. 1 ఆ.

ఆరివేరము చేయు

 • గందరగోళము చేయు.
 • "..... తల్లియస్థుల కొకమాట పాపకర్ముండు చెం చర్థభార మనుచు