పుట:PadabhamdhaParijathamu.djvu/150

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆయ______ఆయె 124 ఆయె______ఆర

 • "ఆయవార మెత్తి అతను చదువుకున్నాడు." వా.

ఆయవ్యయాలు

 • జమాఖర్చులు.

ఆయాసపడు

 • శ్రమపడు.
 • "పనులయెడ నాయాసపడినవారి నెల్ల మిగుల మన్నింపుడు." భాస్క. బాల. 115.

ఆయువు దెగు

 • ఆతుర్దాయము తీరు.
 • "ఆయువు దెగినట్టి జంతువులు సచ్చు." భార. ఆను. 5. 58

ఆయువుపట్టు

 • ముఖ్య మైనది.
 • "కథ కంతా ఆయువుపట్టు ఇక్కడే ఉంది." వా.

ఆయువు మూడు

 • అవసానదశ వచ్చు.
 • "ఆయువుమూడినట్టి సన్యాసికి గట్టె నైదువతన మ్మొక డమ్మకు దక్కువయ్యె బో." నాయకు. 8 పు.

ఆయు వెక్కు

 • ఆయుర్వృద్ధి కలుగు.
 • "ఎల్లవారును గడు నాయు వెక్కి వగయు దెవులు .... లేకున్నారు." హరి. 5. 6.

ఆయె వోయె

 • అయిం దేదో అయింది, పోయిం దేదో పోయింది.
 • "పోనీ నేటికి నాయెబోయె గడు దుర్బుదిన్ విచారింప నేలా?" కా. మా. 2. 123.
 • "నీయంతవాని కిటు లౌ, నా? యాయెంబోయె నిప్పు డైనం దవసిన్, డాయక మీ నా యుసుఱుల, నే యనువున నేటు సేయ సెంచెదఒ యనుచున్." రామకథా. బాల. 4 ఆ.

ఆయె నౌ లే

 • అది సరేకానీ.
 • "ఆయె నౌలే యిది వట్టి శంక." సారం. 2. 22.

ఆరంభశూరత్వము

 • ప్రారంభంలో మాత్రమే పట్టుదల కనబఱచుట.
 • "వాడి దంతా ఆరంభ శూరత్వం. నాలుగు రోజులుపోతే ఏమీ చేయడు." వా.

ఆర గాగు

 • బాగా కాగు.
 • "ఆరం గాగిన పాలమీగడలు హస్తాబ్జంబులం దేవి." హరి. 5. 207.

ఆరగింపు

 • భోజనం; నైవేద్యం, కొంచెం నిరసనగానూ అంటారు.
 • "వాడికి పొద్దున్నే ఆరగింపు అయితే గానీ బయటికి బయలుదేరడు." వా.
 • "స్వామికి ఆరగింపు అవుతున్నది." వా.

ఆరగూరు

 • నిండారు.
 • "అట్లు జనమేజయుడు వగ నారం గూరి." భార. శాంతి. 3. 346.

ఆరటపడు

 • కష్టపడు.