ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఆయ______ఆయె 124 ఆయె______ఆర
- "ఆయవార మెత్తి అతను చదువుకున్నాడు." వా.
ఆయవ్యయాలు
- జమాఖర్చులు.
ఆయాసపడు
- శ్రమపడు.
- "పనులయెడ నాయాసపడినవారి నెల్ల మిగుల మన్నింపుడు." భాస్క. బాల. 115.
ఆయువు దెగు
- ఆతుర్దాయము తీరు.
- "ఆయువు దెగినట్టి జంతువులు సచ్చు." భార. ఆను. 5. 58
ఆయువుపట్టు
- ముఖ్య మైనది.
- "కథ కంతా ఆయువుపట్టు ఇక్కడే ఉంది." వా.
ఆయువు మూడు
- అవసానదశ వచ్చు.
- "ఆయువుమూడినట్టి సన్యాసికి గట్టె నైదువతన మ్మొక డమ్మకు దక్కువయ్యె బో." నాయకు. 8 పు.
ఆయు వెక్కు
- ఆయుర్వృద్ధి కలుగు.
- "ఎల్లవారును గడు నాయు వెక్కి వగయు దెవులు .... లేకున్నారు." హరి. 5. 6.
ఆయె వోయె
- అయిం దేదో అయింది, పోయిం దేదో పోయింది.
- "పోనీ నేటికి నాయెబోయె గడు దుర్బుదిన్ విచారింప నేలా?" కా. మా. 2. 123.
- "నీయంతవాని కిటు లౌ, నా? యాయెంబోయె నిప్పు డైనం దవసిన్, డాయక మీ నా యుసుఱుల, నే యనువున నేటు సేయ సెంచెదఒ యనుచున్." రామకథా. బాల. 4 ఆ.
ఆయె నౌ లే
- అది సరేకానీ.
- "ఆయె నౌలే యిది వట్టి శంక." సారం. 2. 22.
ఆరంభశూరత్వము
- ప్రారంభంలో మాత్రమే పట్టుదల కనబఱచుట.
- "వాడి దంతా ఆరంభ శూరత్వం. నాలుగు రోజులుపోతే ఏమీ చేయడు." వా.
ఆర గాగు
- బాగా కాగు.
- "ఆరం గాగిన పాలమీగడలు హస్తాబ్జంబులం దేవి." హరి. 5. 207.
ఆరగింపు
- భోజనం; నైవేద్యం, కొంచెం నిరసనగానూ అంటారు.
- "వాడికి పొద్దున్నే ఆరగింపు అయితే గానీ బయటికి బయలుదేరడు." వా.
- "స్వామికి ఆరగింపు అవుతున్నది." వా.
ఆరగూరు
- నిండారు.
- "అట్లు జనమేజయుడు వగ నారం గూరి." భార. శాంతి. 3. 346.
ఆరటపడు
- కష్టపడు.