పుట:PadabhamdhaParijathamu.djvu/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆమూ_____ఆమూ 123 ఆయ______ఆయ

  • "కాఱుపుల్ దిని యాము కవిపి." సారం. 1. 68.
  • "నెఱసంజ యాము కవిసె - "
  • చూ. ఆముకొను.

ఆముకొను

  • బలిసిన.
  • లక్షణయా అతిశయించు.
  • "ఆముకొన్న ప్రేమచే." క్షేత్రయ్య.
  • చూ. ఆముకవియు.

ఆముటెద్దు

  • పొగరు పట్టినయెద్దు.

ఆముదంగాడు

  • పట్టుకొంటే వదలనివాడు.
  • "వాడు వట్టి ఆముదంగాడు. వా డెక్కడ తటస్థపడ్డాడు రా నీకు." వా.

ఆముదం త్రాగినమొగం పెట్టు.

  • నిస్పృహను, చేతకానితనమును స్ఫురింపజేయు.
  • "ఎందుకు రా? అలా ఆముదం తాగిన మొహంపెట్టుకొని కూర్చుని ఉన్నావు?" వా.

ఆముదము రాయు

  • నష్టపెట్టు.
  • "నే నేదో చుట్టపుచూపుగా పోతే నాకు ఆముదం రాశాడు." వా.

ఆముపట్టు

  • అహముపట్టు, పొగ రెక్కు.
  • "వాడికి మహా ఆముపట్టి ఉంది లే." వా.

ఆమూలచూడముగా

  • ఆమూలాగ్రముగా, పూర్తిగా.
  • "ఆమూల చూడముగ నెఱిగింతున్." విప్ర. 4. 40.

ఆయకట్టు

  • సాగుకు లాయి కయినభూమి.
  • "ఆ చెరువుకింద మున్నూరు ఎకరాల ఆయకట్టు ఉంది." వా.

ఆయగాళ్ళు

  • ఊరిలోని వివిధవృత్తులవారు.

ఆయన కాయ నై

  • తనంతకు తానే.
  • "ఆయన కాయనై రణమునందలి కోర్కె నినున్ వరించె." పాండవాశ్వ. 61.

ఆయములు ముట్టుకొను

  • కళ లంటు, మర్మము లంటు.
  • "అంగము లొరసుకొంటూ ఆయములు ముట్టుకొంటా." తాళ్ల. సం. 3. 539.

ఆయపాటున

  • మర్మస్థానంలో.
  • ఆయువుపట్టున అనడానికి వాడుకరూపం.
  • "వాడు ఆయపాటున కొట్టేసరికి వీడు ఠపీమని నేల పడ్డాడు." వా.

ఆయవారపు సంచి

  • బిచ్చపుసంచి.
  • "అంకభాగమునందు నాయవారపుసంచి." జైమి. 7. 197.

ఆయవారము

  • బిచ్చము.
  • "ఆయవారముకంటె నధికకల్యాణంబు పఱిగయెన్నుల ధాన్యభక్షణంబు." భాగ. 7. 410.

ఆయవార మెత్తు

  • బిచ్చ మెత్తు.