ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఆన_____ఆను 120 ఆను______ఆపా
ఆనవెట్టు
- ఆజ్ఞాపించు.
ఆనవొడుచు
- ఆజ్ఞాపించు.
- "దొంగ లాన వొడిచిన గోకల్ విడుతురె?" కళా.
- "అలికుంతల! చెలుల నేల నాయాస వొడిచెదు." ప్రభా. 5. 39.
ఆనవైచు
- ఆజ్ఞాపించు.
- "ఆనవైచినట్లు వాహిని యివుర జలము వాఱె నిసుక దోప." భోజ. 3. 18.
ఆనాలు
- ఆనవాలు, నానబ్రాలు, వడపప్పు, నానవేసిన పెసరపప్పును ఉపవాసం ఉండవలసిన పండుగలలో ఉపయోగిస్తారు.
- చూ. ఆనవాలపాయసము.
ఆనిపట్టు
- ఊని పట్టు.
- "ఆనిపట్టి నే బాపపుణ్యములు అనుభవించవలె నన్నప్పుడు." తాళ్ల. సం. 9. 17.
ఆనుకొను
- తిను.
- నిరసనలోనే వాడుక.
- "అనుకోవడానికి అయిదిస్తరాకుల అన్నం కావాలనే. ఇక్కడపుల్ల అక్కడ తీసిపెట్టడు గదా? ఎట్లా వస్తుందీ అంట?" వా.
ఆనుపానులు
- పుట్టుపూర్వోత్తరాలు. జం.
- "ఆ విషయంలో అనుపానులు తెలుసుకొని నాకు రాస్తే చూస్తాను." వా.
ఆనోటా ఆనోటా
- కర్ణాకర్ణికగా.
- "ఆనోటా ఆనోటా పడి వీడి వ్యవహారం నలుగురికీ తెలిసిపోయింది." వా.
ఆపదమొక్కులు సంపద మఱపులు
- ఆపదలు వచ్చినప్పుడు మొక్కుకోవడం, సంపదలు వచ్చినప్పుడు మఱచిపోవడం మానవనైజ మనుట. సంపదగునుపులు అని కొన్ని ప్రాంతాల వాడుక. జం.
ఆపసోపములు పడు
- అసురుసు రను; అలయు.
- "పలుతాపంబున నాపసోపములు చూపట్టంగ నిట్టట్టుగా, నల సెం బంటవలంతి దీని కిక శైత్యప్రక్రియల్ సేయగా వలె......" భద్రాయు. 3. 191.
ఆపాతమధురము
- వినగానే బాగుంటుంది - తరచి చూస్తే కాదు.
ఆపాతరమణీయము
- విన్న వెంటనే ఆనందింప జేయునది.
- సంగీత మాపాతరమణీయమని పెద్దలు చెప్తారు.
- ఇంతేకాక యిది పైకి బాగా