పుట:PadabhamdhaParijathamu.djvu/147

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆపూ_____ఆపో 121 ఆపో_____ఆబు

కనిపించినా లోతుగా చూస్తే అలా ఉండదు అనే అర్థంలో కూడా ఉపయోగిస్తారు.

 • "ఇది కేవలం ఆపాతరమణీయమైన మాట. ఆలోచిస్తే యిందులో సారం నిస్సారమే అని నీకే తేలుతుంది."
 • చూ. ఆపాతమధురం, అవిచారితరమణీయము.

ఆపూటకు లేని

 • మిక్కిలి పేద యైన.
 • "ఆపూటకు లేనివాడే అంత మిడిసిపడితే యింక ఉన్న వాడిసంగతి చెప్పాలా? వా.

ఆపేరికూర నంజమి

 • ఆపేరే పడదనుట.
 • "భీమధంవుండు దినిన నా పేరి కూర నంజ నే నిది వెలి గాగ నాకు నొక్క." దశకు. 10. 18.
 • చూ. ఆతని పేరికూర నంజు.

ఆపైన దేవు డున్నాడు

 • చేయగలిగింది చేసితి ననుట.
 • "నేను చేయగలిగింది చేశాను. ఆపైన దేవు డున్నాడు." వా.

ఆపోవని

 • సంతృప్తి చెందని.
 • "కోపము నుబ్బును గర్వము, నాపోవని యునికియును దురభిమానము ని, ర్య్వా పారత్వము ననునవి, కా పురుషగణంబు లండ్రు కౌరవనాథా!" భార. ఉద్యో. 1 ఆ.

ఆపోశనము పట్టు

 • సంధ్యావందనాదులలో తర్జనితో చూపుడువేలిని మడిచి ఆ అరచేతిలో ఏర్పడు పల్లములో తీర్థము పోసుకొని మంత్రపూర్వకముగా తీసుకొనుటకు ఆపోశనంఅంటారు. ఆవిధముగా జలమును లోనికి తీసికొను.
 • "బడబాగ్ని వడికి లోపడని పాథోరాశి భోరున గొనియె నాపోశనముగ." కా. మా. 1. 124.

ఆపోశనించు

 • ఆపోశనము గొను.
 • "దివ్యాస్త్రనైపుణి ... ప్రాణములు నాపోశనింపగా నాశించె."
 • వర. రా. యు. పు 240 పంక్తి 13.

ఆప్రొద్దు పొయి రాజనట్టి

 • ఆపూటకుకూడ గడవని (పేద).
 • "ఆప్రొద్దు పొయిరాజనట్టి నిఒర్పేదయు." పాండు. 1. 101.

ఆబాలగోపాలము

 • చూ. ఆబాలవృద్ధాదులు.

ఆబాలవృద్ధాదులు

 • అందఱూ.
 • చిన్నా పెద్దా అంతా అని నేటి వాడుక
 • పండితా. ప్రథ. దీక్షా. పుట. 161.
 • చూ. ఆబాలగోపాలము.

ఆ బుర్రలో విత్తనాలే

 • అదే రకమే అనుట.
 • కూరగాయల విత్తనాల వంటి వానిని సొరకాయ బుర్రలో వేసి ఉంచే అలవాటుపై యేర్పడినది. ఒకేబుర్రలో ఒకరకమైన విత్తనాలే వేస్తారు.