పుట:PadabhamdhaParijathamu.djvu/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆన_____ఆన 119 ఆన_____ఆన

  • మూరెడు అనగా లక్షణయా కొంచెము అనుట. అణు మాత్ర మని యీ సందర్భంలో వాడుక.

ఆననము లేగతి నాలోకింతు?

  • వాడిమొఖ మెట్లా చూస్తాను? ఏదైనా తనకు గొప్ప అవమానం జరిగినప్పుడు తన స్మేహితుల యెదుట పడలేక పోవుట. సహజము. దీనికి వ్యావహారిక రూపం వారి ముఖం ఎట్లా చూస్తాను?
  • "ఈ కలహ మపుడ వినబడు నాకంబున, సురల యాననము లేగతి నాలోకింతు..." కళా. 3. 245.
  • చూ. ముఖం ఎట్లా చూస్తాను.

ఆనపొడుచు

  • ఆజ్ఞాపించు.
  • "ఆలికుంతల చెలుల నేల యాన వొడిచెదు." ప్రభా. 5. 39.
  • చూ. ఆనవొడుచు.

ఆనబెట్టు

  • ఆకలి తీరా అన్నం పెట్టు.
  • నిరసనగా ఒకరినిగురించి తిండిపోతు అంటూ అనేమాట.
  • "వీడికి మేం ఆనబెట్ట లేమమ్మా!" వా.

ఆనమాలు

  • చూ. ఆనవాలు.

ఆన యిడు

  • ఒట్టుపెట్టు.
  • సారం. 2. 205.

ఆన లిడు

  • ఆజ్ఞాపించు.

ఆనలు వొడిపించు

  • ఆజ్ఞాపించు, ఆనవెట్టు.
  • "ఆనలు వొడిపించి యాదృతి స్వర్ణ వర్షం వవర్ష నా వారక వర్షంబు గురియించె."
  • పండితా. ద్వితీ. మహి. పుట. 118.

ఆనవాయితీ

  • మామూలు.
  • క్రొత్త. 26.

ఆనవాలపాయసము

  • నానబాలుతో చేసినపాయసము.
  • "అమృతరస్ఫ్పమం బైనకమ్మని యానవాల పాయసము జంబాల మయ్యె." నైష. 6. 124.

ఆనవాలు

  • చిహ్నము, గురుతు.
  • ఈ ఆనవాలు ఆనమాలు అనే రూపంలో వాడుకలో వినిపిస్తుంది.
  • "ఆనవాలు దెమ్ము నృపుపాల ననియె." భార. అశ్వ. 3. 95.
  • చూ. అడయాళము; ఆనవాలుపట్టు.

ఆనవాలు పట్టు

  • గుఱుతుపట్టు.
  • "అయ్యో! నువ్వు మా రామయ్య కొడుకా! ఆనవాలే పట్టలేదే." వా.
  • "వాడు ఆనమాలు పట్టలేకుండా చిక్కిపోయాడు." వా.
  • చూ. ఆనవాలు.