పుట:PadabhamdhaParijathamu.djvu/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆది_____ఆదె 118 ఆన_____ఆన

ఆదికారణము

  • మూలకారణము.
  • "ఆదికారణ మతడ మీ యాపదలకు." భార. కర్ణ. 2. 124.

ఆదికొను

  • పై బడు, మార్కొను.
  • "వృషభంబున కాదికొను బెబ్బులియుంబోలె." భార. విరా. 5. 73.

ఆది తీసుకొను

  • కొలత తీసుకొను.
  • "దర్జీవాడు ఆది తీసుకొని పోయి పదినాళ్లయింది. ఇంకా చొక్కాలు కుట్టి యివ్వనంటున్నాడు." వా.

ఆదిమలత్రయము

  • "ఆదిమలత్రయహరణ మౌ."
  • పండితా. ప్రథ. పురా. పుట. 277.

ఆదివావితోడ

  • ఒక వరుసక్రమములో; యథాక్రమముగా.
  • "ఆదివావితోడ నంతంత దవ్వుల, నుండ బంచి యంబుజోదరుండు." హరి. 6. 43.

ఆదివెట్టు

  • తాకట్టు పెట్టు, కుదువ పెట్టు.
  • "కాసువీసంబు వెడలమి గ్రాసమునకు నాది వెట్టిరి క్షేత్రంబులందు గొన్ని." మను. 3. 129.

ఆదెబ్బతో....

  • ఆ పనివల్ల, కొంత నష్టం జరిగాక.
  • "ఆ దెబ్బతో వాడు దారికి వచ్చాడు." వా.

ఆనందపదములు

  • జానపదగేయములలో ఒక నిశ్చితశాఖ అయి ఉంటుంది. ఆనందాన్ని సూచిస్తూ ఆడుతూ పాడుకునే పదాలు.
  • పండితా. ప్రథ. పాద. పుట 513.

ఆనందము మరుగు

  • సుఖము మరుగు.
  • "కాన దటిచ్చల మగురాజ్యానందము మరగి యింద్రియారాముడ నై." ఆము. 2. 81.
  • మరగు వాడుకలో మరుగుగా వినవస్తుంది.

ఆనందవార్ధి దేల్చు

  • ఆనందింప జేయు.
  • "తమకమున నింతు లెల్లను దమక తమక వలచె నని యెంచ నానందవార్ధి దేల్చి." రాజగో. 1. 19.

ఆనకట్ట

  • నదులకూ వానికీ కట్టకట్టి నీరు నిలువచేసి సాగుకు ఉపయోగించడంకోసం కట్టేకట్ట.
  • "గోదావరి కృష్ణలకు ఆనకట్ట కట్టడం వల్ల నే అక్కడ దరిద్రం పోతుంది." వా.

ఆనతిచ్చు

  • చెప్పు - వచించు.

ఆనతి యిచ్చు

  • చూ. ఆనతిచ్చు.

ఆనతి మూరె డైన దాటమి

  • ఆజ్ఞ ఏమాత్రం మీఱక పోవుట.