పుట:PadabhamdhaParijathamu.djvu/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆత_____ఆద 117 ఆద_____ఆది

పరమ పాపిఅని భావము.

  • "కడు గుటిలవర్తనుం డెన్నడు నాతని పేరికూర నంజకుము నృపా!" హరి.. 2. 38.

ఆతపత్రంబు లూదు

  • గొడుగులు పట్టు.
  • "దిగధీశు లున్నతస్థిరభక్తియుక్తి నాతతమౌక్తికా తపత్రంబు లూద." కుమా. 9. 28.

ఆతురసన్యాసం

  • ప్రాణాపాయస్థితిలో తీసుకొను సన్యాసం.
  • ఎలాగూ ఆశ లేనప్పుడు వదలు కొన్నాడు - అన్న సందర్భంలో ఉపయోగించే పలుకుబడి.
  • "వాడు లక్షరూపాయలు ఆ స్కూలుకు విరాళం ఇచ్చ డట. ఎందుకో తెలుసా? ఇన్‌కంటాక్సు భాధ తప్పించుకోడానికి. ఇదంతా ఆతురసన్యాసం." వా.

ఆదట వోవక

  • ఆశ తీరక.
  • "అ య్య న ఘు డు దాని జిత్తమున నాదట నోవక చూచె." భార. ఆది. 4. 145.

ఆద మఱచి నిద్రపోవు

  • నిర్భయముగా నుండు.
  • "పగతురు నే డాదమఱచి నిద్ర వోదు రది తఱి పొడువన్." భార. సౌప్తి. 1. 51.

ఆదము నిద్రపోవు

  • ఆదమఱచి నిద్రించు.
  • నేడు ఆదమఱచి ... అన్న రూపంలోనే వాడుక.
  • "అమృ తాబ్ధి సొచ్చి యాదము, నిద్రవోయిన పీతాంబరుడు బిట్టుచెదరి లేవ." కుమా. 11. 3.

ఆదర బాదర

  • 1. త్వరత్వరగా.
  • "గంట అయిపోయిం దని నేను ఆదర బాదరా బయలుదేరి వచ్చాను." వా.
  • 2. తగిన యేర్పాట్లేవీ లేకనే.
  • "మేనేజరు పిలిచా డనేసరికి ఇతను ఆదరాబాదరా పరుగెత్తాడు. ఆ తొందరలో అకౌంటుపుస్తకం కాస్తా ఇక్కడే పెట్టిపోయి నాలుగుచీవాట్లు తిన్నాడు." వా.
  • 3. తొందరగా.
  • "ఆదరాబాదరా నాలుగు మెతుకులు నోట్లో వేసుకొని వచ్చాను." వా.

ఆదాయము చాలదు

  • చాలినంత వరుంబడి లే దనుట.
  • "ఆదాయం చాలని ఉద్యోగం ఉండీ ప్రయోజనం తక్కువ." వా.

ఆదాయవ్యయాలు

  • జమాఖర్చులు.

ఆది ఇచ్చు

  • కొలత యిచ్చు.
  • "గాజులకు ఇప్పుడే ఆది యిచ్చి వచ్చాను. గుత్తంగా లేకపోతే నా కిష్టంలేదు. అందుకనీ...." వా.