ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఆది_____ఆదె 118 ఆన_____ఆన
ఆదికారణము
- మూలకారణము.
- "ఆదికారణ మతడ మీ యాపదలకు." భార. కర్ణ. 2. 124.
ఆదికొను
- పై బడు, మార్కొను.
- "వృషభంబున కాదికొను బెబ్బులియుంబోలె." భార. విరా. 5. 73.
ఆది తీసుకొను
- కొలత తీసుకొను.
- "దర్జీవాడు ఆది తీసుకొని పోయి పదినాళ్లయింది. ఇంకా చొక్కాలు కుట్టి యివ్వనంటున్నాడు." వా.
ఆదిమలత్రయము
- "ఆదిమలత్రయహరణ మౌ."
- పండితా. ప్రథ. పురా. పుట. 277.
ఆదివావితోడ
- ఒక వరుసక్రమములో; యథాక్రమముగా.
- "ఆదివావితోడ నంతంత దవ్వుల, నుండ బంచి యంబుజోదరుండు." హరి. 6. 43.
ఆదివెట్టు
- తాకట్టు పెట్టు, కుదువ పెట్టు.
- "కాసువీసంబు వెడలమి గ్రాసమునకు నాది వెట్టిరి క్షేత్రంబులందు గొన్ని." మను. 3. 129.
ఆదెబ్బతో....
- ఆ పనివల్ల, కొంత నష్టం జరిగాక.
- "ఆ దెబ్బతో వాడు దారికి వచ్చాడు." వా.
ఆనందపదములు
- జానపదగేయములలో ఒక నిశ్చితశాఖ అయి ఉంటుంది. ఆనందాన్ని సూచిస్తూ ఆడుతూ పాడుకునే పదాలు.
- పండితా. ప్రథ. పాద. పుట 513.
ఆనందము మరుగు
- సుఖము మరుగు.
- "కాన దటిచ్చల మగురాజ్యానందము మరగి యింద్రియారాముడ నై." ఆము. 2. 81.
- మరగు వాడుకలో మరుగుగా వినవస్తుంది.
ఆనందవార్ధి దేల్చు
- ఆనందింప జేయు.
- "తమకమున నింతు లెల్లను దమక తమక వలచె నని యెంచ నానందవార్ధి దేల్చి." రాజగో. 1. 19.
ఆనకట్ట
- నదులకూ వానికీ కట్టకట్టి నీరు నిలువచేసి సాగుకు ఉపయోగించడంకోసం కట్టేకట్ట.
- "గోదావరి కృష్ణలకు ఆనకట్ట కట్టడం వల్ల నే అక్కడ దరిద్రం పోతుంది." వా.
ఆనతిచ్చు
- చెప్పు - వచించు.
ఆనతి యిచ్చు
- చూ. ఆనతిచ్చు.
ఆనతి మూరె డైన దాటమి
- ఆజ్ఞ ఏమాత్రం మీఱక పోవుట.