ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఆత_____ఆద 117 ఆద_____ఆది
పరమ పాపిఅని భావము.
- "కడు గుటిలవర్తనుం డెన్నడు నాతని పేరికూర నంజకుము నృపా!" హరి.. 2. 38.
ఆతపత్రంబు లూదు
- గొడుగులు పట్టు.
- "దిగధీశు లున్నతస్థిరభక్తియుక్తి నాతతమౌక్తికా తపత్రంబు లూద." కుమా. 9. 28.
ఆతురసన్యాసం
- ప్రాణాపాయస్థితిలో తీసుకొను సన్యాసం.
- ఎలాగూ ఆశ లేనప్పుడు వదలు కొన్నాడు - అన్న సందర్భంలో ఉపయోగించే పలుకుబడి.
- "వాడు లక్షరూపాయలు ఆ స్కూలుకు విరాళం ఇచ్చ డట. ఎందుకో తెలుసా? ఇన్కంటాక్సు భాధ తప్పించుకోడానికి. ఇదంతా ఆతురసన్యాసం." వా.
ఆదట వోవక
- ఆశ తీరక.
- "అ య్య న ఘు డు దాని జిత్తమున నాదట నోవక చూచె." భార. ఆది. 4. 145.
ఆద మఱచి నిద్రపోవు
- నిర్భయముగా నుండు.
- "పగతురు నే డాదమఱచి నిద్ర వోదు రది తఱి పొడువన్." భార. సౌప్తి. 1. 51.
ఆదము నిద్రపోవు
- ఆదమఱచి నిద్రించు.
- నేడు ఆదమఱచి ... అన్న రూపంలోనే వాడుక.
- "అమృ తాబ్ధి సొచ్చి యాదము, నిద్రవోయిన పీతాంబరుడు బిట్టుచెదరి లేవ." కుమా. 11. 3.
ఆదర బాదర
- 1. త్వరత్వరగా.
- "గంట అయిపోయిం దని నేను ఆదర బాదరా బయలుదేరి వచ్చాను." వా.
- 2. తగిన యేర్పాట్లేవీ లేకనే.
- "మేనేజరు పిలిచా డనేసరికి ఇతను ఆదరాబాదరా పరుగెత్తాడు. ఆ తొందరలో అకౌంటుపుస్తకం కాస్తా ఇక్కడే పెట్టిపోయి నాలుగుచీవాట్లు తిన్నాడు." వా.
- 3. తొందరగా.
- "ఆదరాబాదరా నాలుగు మెతుకులు నోట్లో వేసుకొని వచ్చాను." వా.
ఆదాయము చాలదు
- చాలినంత వరుంబడి లే దనుట.
- "ఆదాయం చాలని ఉద్యోగం ఉండీ ప్రయోజనం తక్కువ." వా.
ఆదాయవ్యయాలు
- జమాఖర్చులు.
ఆది ఇచ్చు
- కొలత యిచ్చు.
- "గాజులకు ఇప్పుడే ఆది యిచ్చి వచ్చాను. గుత్తంగా లేకపోతే నా కిష్టంలేదు. అందుకనీ...." వా.