పుట:PadabhamdhaParijathamu.djvu/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆడు______ఆడు 116 ఆడు_____ఆత

నప్పుడు ఆడవాళ్లు అనేమాట. 'నీకు అక్కా చెల్లెళ్లు లేరా? న న్నలా అవమానిస్తావా' అని. నేటికీ వాడుకలో 'నీ కేం అక్కా చెల్లెళ్లు లేరా? నా వెంట బడుతున్నావు?" అంటారు. ఆడుతోడు లేరా>? అని కూడా క్వాచిత్కంగా అంటారు.

  • "పుర మిది చూడ నింత చెడిపోయె నయోమఱి యాడుతోడ బు, ట్టరె? ననువంటి సాధ్విని..." శుక. 2. 369.

ఆడుదోడునను బుట్టవె?

  • నీకు అక్కా చెల్లెండ్లు లేరా?
  • "బోయవె యాడుదోడునను బుట్టవె శాపనిమిత్తమే తపంబు." మను. 4. 87.
  • చూ. ఆడుతోడ బుట్టరె.

ఆడుపడుచు

  • భర్తృ సోదరి.
  • చూ. ఆడుబిడ్డ.

ఆడుపడుచు సిరి

  • నిలవనిది.
  • ఆడవాళ్ల చేతిలో డబ్బు నిలవ దనుట. మగవారే పెత్తనం వహించవలెనన్న నాటి భావంపై ఏర్పడినది.
  • గువ్వలచెన్న. 33.
  • చూ. ఆడదానిచేతి అర్థము.

ఆడుపాటు

  • స్త్రీత్వము.
  • "మాయయు జీవుడుం బెరసి మైత్రి యొకానొక డాచరించుచుం బాయక యాడుపాటు మగపాటువడన్."
  • పాండు. 4. 274.

ఆడుబిడ్డ

  • ఆడుపడుచు.
  • ఆడుబిడ్డ, ఆడుపడుచు అను మాటలు భర్తృసోదరి అన్న అర్థంలో నేటికీ వాడుకలో ఉన్నవి.
  • "కొత్తగా జేయించుకొన్న ముక్కరకు నై యడలు దుర్వారమై యాడుబిడ్డ." పాండు. 3. 50.
  • "పెళ్లిలో ఆడబిడ్డ (పడుచు) లాంఛనాల కని వాళ్లు చాలా అడిగారు. అంచేత పెళ్ళి కుదర లేదు."
  • "ఉగాదికి మా ఆడపడుచును పంప మని మా వారు వాళ్ల వాళ్ళకు రాశారు." వా.
  • చూ. ఆడుపడుచు.

ఆడ్యుడు

  • నాథుడు.
  • "వాళ్ళ యింటికి ఆడ్యుడు ఎవడూ లేడు." వా.
  • "వాళ్ళది ఆడ్యుడు లేని సంసారం." వా. *చూ. నాథుడు.

ఆణిపూస

  • శ్రేష్ఠుడు.
  • "కాళిదాసు కవుల్లో ఆణిపూస." వా.

ఆతని పేరికూర నంజకుము

  • అతని పే రయినా యెత్తకు మనుట. వాని పేరున్న కూర కూడా ముట్టకూడదంటే అంతేకదా.