పుట:PadabhamdhaParijathamu.djvu/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆకా______ఆకు 109 ఆకు______ఆకు

ప్రసిద్ధంగా కనబడుతుంది. అందుపై వచ్చినపలుకుబడి.

  • "నీ కేం ఆకాశవాణి చెప్పిందా?" వా.

ఆకాశానికి ఎత్తు

  • గొప్పగా పొగడు.
  • "వాడికి సరిపోతే ఆకాశానికి ఎత్తుతాడు. లేకపోతే పాతాళంలోకి తోసేస్తాడు." వా.

ఆకాశానికి చిల్లి పడినట్లు

  • వర్షం విపరీతంగా వచ్చిన దనుటలో ఉపయోగించే పలుకుబడి.
  • "ఈరోజు వర్షం ఆకాశానికి చిల్లిపడినట్లు మహాజోరుగా కురుస్తూ ఉంది." వా.

ఆకాశానికి నిచ్చెన వేయు

  • అసాధ్యకార్యము చేయు.
  • "ఆకాశానికి నిచ్చెనలు వేయా లంటే మన తరమా?" వా.

ఆకు, అలము

  • ఆకులు. జం.
  • "వనమున నాకలంబు దిని వంతల గుందుచు నింత కెన్నడే, ననుజుడు దాను జచ్చు నడియాస లి కేటికి..."
  • బాస్క. సుంద. 186.
  • చూ. ఆకలములు.

ఆకుకందకుండా పోకకు పొందకుండా

  • అందికా పొందికా లేకుండా, ఏదీ తేల్చీ చెప్పడం లేదనే అర్థంలో ఉపయోగిస్తారు.
  • నాయకు. 7 పు.
  • "ఆకుకు అందకుండా పోకకు పొందకుండా మాట్లాడితే ఏం లాభం రా." వా.

ఆకుచాటు పిందెవలె

  • పెద్దలచాటున; ఏమాత్రం దెబ్బ తగలకుండా.
  • "......మీ పదయుగంబుల దాపున నాకుచాటుపిం దియవలె నుండు నేను ధరణీతలభారము బూన నేర్తునే."
  • నలచ. 2. 69.
  • చూ. ఆకుమఱుగుపిందెవలె.

ఆకుజిలుకల మొత్తంబువంతున

  • అధికముగా, గుంపులు గుంపులుగా.
  • చేలలో పంట నిండుగా ఉన్నప్పుడు ఈ ఆకుచిలుకలు విపరీతంగా వస్తాయి. దానిమీద యేర్పడినపలుకుబడి.
  • "బేడిసెకదుపుభంగిని... యాకుజిలుకల మొత్తంబు వంతున..." హంస. 3. 29.

ఆకు మడిచి ఇచ్చు

  • తాంబూల మిచ్చు.
  • "కర్పూరంబుతోడి బాగా లీరాదో యాకు మడిచి యీరాదొ చెలీ!" కళా. 4. 70.

ఆకుమడుపులు

  • తములపాకుల చిలకలు.
  • "హెచ్చువాసన వక్క లిచ్చి చుట్టిన యాకు మడుపు లీ దివిరెడునడపదాని."
  • ఉత్త. రామా. 423.

ఆకుమఱుగుపిందెవలె

  • ఆకుచాటుపిందెవలె.