పుట:PadabhamdhaParijathamu.djvu/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆకా_____ఆకా 108 ఆకా______ఆకా

ఆకాశంనుండి ఊడిపడ్డట్టు

  • మానవాతీతునివలె.
  • "ఏదో ఆకాశంనుండి ఊడిపడ్డట్టు మాటాడుతున్నావే?" వా.

ఆకాశంవంక చూచు

  • ఏమీ చెప్ప లేకపోవు.

ఆకాశచిత్రము

  • నిరాధార మైనది.
  • "......ఇటు లే దర్కింప నిం కేల కణ్వుని లోకమ్మున నూర్ధ్వరేతు డన విందుం గాదె యట్లౌట నా, యనఘుం డీచెలి నెట్లు గాంచు గలదే యాకాశ చిత్రం బిలన్."
  • శకుం 2. 24.

ఆకాశతాండవం

  • ఊరికే గంతులు వేయుట.

ఆకాశ పంచాంగం

  • "వాడి దంతా ఆకాశపంచాగం. దాన్ని ప్రమాణంగా నమ్ముకుంటే నగుబాట్లపా లవుతాం." వా.
  • చూ. ఆకాశపురాణం.

ఆకాశపురాణం

  • అర్థం లేనిసంగతి. ఆధారం లేని వట్టి ఊకదంపుడు. నానా. 38
  • "వాడి దంతా వట్టి ఆకాశపురాణం." వా.
  • చూ. ఆకాశపంచాంగం.

ఆకాశమంత పందిరి

  • పెద్ద పందిరి.
  • జానపద కథల ద్వారా వచ్చినపలుకుబడి.
  • "ఆకాశమంత పందిరి. భూమంత అరుగు. కస్తూరి కళ్లాపు. ముత్యాల ముగ్గులు. ఆ రాజకుమార్తె వివాహం రంగరంగవైభవంగా జరిగింది." వా.

ఆకాశమున దాపరము లిడగల

  • నింగికి నిచ్చెన వేయగల - అసాధ్య కార్యములను నిర్వర్తించే నెఱజాణ అనుటలో....."
  • కుమా. 8. 135.

ఆకాశరామన్న

  • పేరు లేకుండా ఉత్తరాలూ, అర్జీలు రాసేవాడు.
  • "ఎవడో ఆకాశరామన్న ఏదో రాశాడట! వీడు నమ్మాడట. ఏం లక్షణంగా ఉంది వ్యవహారం?" వా.

ఆకాశరామన్న అర్జీలు

  • అనామక లేఖలు.
  • "ఆ సబ్ యిన్ స్పెక్టరు లంచాలు తీస్తాడని ఈమధ్య బోలెడు ఆకాశరామన్న అర్జీలు వచ్చా యట. దాంతో వాణ్ణి మార్చేశారు." వా.
  • చూ. ఆకాశరామన్న జాబులు.

ఆకాశరామన్న జాబులు

  • ఆకాశరామన్న అర్జీలు.
  • చూ. ఆకాశరామన్న అర్జీలు.

ఆకాశవాణి

  • అశరీరవాక్కు.
  • మన పురాణాలలో ఏదయినా ఆకాశవాణి చెప్పడం, దానిని వేదవాక్కుగా స్వీకరించడం