పుట:PadabhamdhaParijathamu.djvu/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆకు______ఆకు 110 ఆకు_______ఆకొ

  • "తల్లి తండ్రులయొద్ది తనయులగతి నాకు మఱుగుపిందెలరీతి నెఱి వహించి."
  • హరిశ్చంద్ర. 1. 212.
  • చూ. ఆకుచాటుపిందెవలె.

ఆకులపడు

  • కలత చెందు.
  • "ఆ కలకల మాలించిన, దాకులపడినది వగర్చినది." నాయకు. పు. 89.

ఆకులు వేసికొను

  • తాంబూలము వేసికొను.
  • "పండుటాకులు కప్రంపు భాగములను వేడ్కతోడుత నిద్దఱు వేసికొనుచు." హంస. 1. 240.
  • చూ. వక్కాకు వేసికొను; ఆకు వేసుకొను.

ఆకులలోపలి పిందె

  • మానినీ. 56.
  • చూ. ఆకుమఱుగుపిందె.

ఆకులు అలము

  • ఆకూ అలమూ అని వాడుక. చెట్టు చేమలాంటిది. ఒకే అర్థ మున్న పదాలయుగళం. జం.
  • "అడవి చెట్టుల బంక, లాకులు నలము." పండితా. ప్రథ. పురా. పుట. 378.

ఆకులు లేచినవి

  • ఇంతమంది భోజనం చేసినారు అనేసందర్భంలో ఉపయోగించేపలుకుబడి.
  • "వారింటి పెండ్లిలో పూటకు వెయ్యి ఆకులు లేచినవి." వా.

ఆకులు వేసినారు

  • భోజనానికి లేవండి అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "ఆకులు వేసినారు. కాళ్లు కడుక్కోండి." వా.
  • చూ. కంచాలు పెట్టినారు.

ఆకులో మిడత

  • మహా నెఱజాణ అనే అర్థంలో వెక్కిరింపుగా అనేమాట.
  • ఆకులమీద ఉన్న మిడత ఎగి రెగిరి పడుతూ ఉంటుంది. అందుపై వచ్చినపలుకుబడి.
  • "అదా అమ్మా! ఆకులో మిడత." వా.

ఆకులోకి వచ్చు

  • భోజనము సమకూరు.
  • "ఊరికే కూర్చుంటే ఆకులోకి ఎట్లా వస్తుంది?" వా.

ఆకు వేసుకొను

  • తాంబూలము వేసుకొను.
  • "ఆకు వేసుకోండి సామీ!? వా.
  • చూ. ఆకులు వేసికొను.

ఆకుసన్నాలు

  • ధాన్యంలో ఒక భేదము.

ఆకూ వక్కా

  • తాంబూలం.
  • "ఆకూ వక్కా తెచ్చి యీవే, అయ్యగా రొచ్చారు." వా.

ఆకొత్తు

  • అడకత్తెర.