పుట:PadabhamdhaParijathamu.djvu/137

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆగ_____ఆచ 111 ఆచ______ఆజ్ఞ

ఆగడపలు

  • సోపానములవలె తీరిన మబ్బులు.
  • పాండు. 3. 179.

ఆగడించు

  • ఆగడము సేయు. రచ్చ కీడ్చు, అగుడు పెట్టు.
  • "అజ్జదాసయగారి నాగడించితిమా."
  • పండితా. ద్వితీ. మహి. పుట. 214.

ఆగమేగాలమీద పోవు

  • అతివేగంగా పోవు.
  • "ఆవిడకు జబ్బని తెలిసేసరికి అతడు ఆగమేగాలమీద పోయినాడు." వా.

ఆగమ్మకాకిలా తిరుగు

  • అనవసరంగా ఊరికే తిరుగు.
  • "వాడు ఆగమ్మకాకిలా ఊరంతా తిరుగుతూ ఉంటాడు. వాడికి పిల్ల నివ్వమంటే ఎవ రిస్తారు?" వా.

ఆగ్రహోదగ్రు డగు

  • కోపంతో మండిపడు.
  • ఇది ఇలా కలిసి ప్రచురంగా వాడుకలో ఉన్నది.
  • "వాడు అగ్రహోదగ్రు డయినాడు - నే నామాట చెప్పేసరికి." వా.

ఆఘాయిత్యము చేయు

  • 1. చిన్న దానికి పెద్దగా అల్లరి పెట్టు.
  • 2. దౌర్జన్యము చేయు.

ఆచంద్రతారకం

  • కలకాలమూ.
  • చూ. ఆచంద్రతారార్కం.

ఆచంద్రతారార్కం

  • కలకాలం.
  • చంద్రుడూ, నక్షత్రాలూ, సూర్యుడూ ఉన్నంత కాలం.
  • చూ. ఆచంద్రతారకం.

ఆ చెంపా యీచెంపా వాయించు

  • ఎడాపెడా కొట్టు.
  • "ఆ చెంపా యీ చెంపా వాయిస్తే వాడే నిజం చెప్తాడు." వా.

ఆచూకి తీయు

  • జాడ తీయు.
  • "ఆ దొంగ కేసు విషయ మై ఆచూకీ తీయడానికి పోలీసు వాళ్లు తిరుగుతున్నారు." వా.

ఆజానుబాహుడు

  • ఒడ్డుపొడుగూ అయినవాడు. మోకాలు తాకేచేతు లున్న వాడని వాచ్యార్థం.
  • "వాడు మాంచి ఆజానుబాహుడూ, స్ఫురద్రూపీ." వా.

ఆజు బాజుల

  • చుట్టుపట్ల.
  • "మోజుపడి యున్న నాజుం, బాజుల నిలువంగ వీలుపడునే? చెపుమా?" మగువ. 2. 31.
  • "ఈ ఆజుబాజుల్లో అతనంత మాటవాసి కలవాడు మరొకడు లేడు.? వా.

ఆజ్ఞ తల మోచు

  • ఆనతి శిరసావహించు.
  • "మీ యాజ్ఞ దల మోచి పోయెద."
  • పండితా. ద్వితీ. పర్వ. పుట. 287.