ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఆకా_____ఆకా 108 ఆకా______ఆకా
ఆకాశంనుండి ఊడిపడ్డట్టు
- మానవాతీతునివలె.
- "ఏదో ఆకాశంనుండి ఊడిపడ్డట్టు మాటాడుతున్నావే?" వా.
ఆకాశంవంక చూచు
- ఏమీ చెప్ప లేకపోవు.
ఆకాశచిత్రము
- నిరాధార మైనది.
- "......ఇటు లే దర్కింప నిం కేల కణ్వుని లోకమ్మున నూర్ధ్వరేతు డన విందుం గాదె యట్లౌట నా, యనఘుం డీచెలి నెట్లు గాంచు గలదే యాకాశ చిత్రం బిలన్."
- శకుం 2. 24.
ఆకాశతాండవం
- ఊరికే గంతులు వేయుట.
ఆకాశ పంచాంగం
- "వాడి దంతా ఆకాశపంచాగం. దాన్ని ప్రమాణంగా నమ్ముకుంటే నగుబాట్లపా లవుతాం." వా.
- చూ. ఆకాశపురాణం.
ఆకాశపురాణం
- అర్థం లేనిసంగతి. ఆధారం లేని వట్టి ఊకదంపుడు. నానా. 38
- "వాడి దంతా వట్టి ఆకాశపురాణం." వా.
- చూ. ఆకాశపంచాంగం.
ఆకాశమంత పందిరి
- పెద్ద పందిరి.
- జానపద కథల ద్వారా వచ్చినపలుకుబడి.
- "ఆకాశమంత పందిరి. భూమంత అరుగు. కస్తూరి కళ్లాపు. ముత్యాల ముగ్గులు. ఆ రాజకుమార్తె వివాహం రంగరంగవైభవంగా జరిగింది." వా.
ఆకాశమున దాపరము లిడగల
- నింగికి నిచ్చెన వేయగల - అసాధ్య కార్యములను నిర్వర్తించే నెఱజాణ అనుటలో....."
- కుమా. 8. 135.
ఆకాశరామన్న
- పేరు లేకుండా ఉత్తరాలూ, అర్జీలు రాసేవాడు.
- "ఎవడో ఆకాశరామన్న ఏదో రాశాడట! వీడు నమ్మాడట. ఏం లక్షణంగా ఉంది వ్యవహారం?" వా.
ఆకాశరామన్న అర్జీలు
- అనామక లేఖలు.
- "ఆ సబ్ యిన్ స్పెక్టరు లంచాలు తీస్తాడని ఈమధ్య బోలెడు ఆకాశరామన్న అర్జీలు వచ్చా యట. దాంతో వాణ్ణి మార్చేశారు." వా.
- చూ. ఆకాశరామన్న జాబులు.
ఆకాశరామన్న జాబులు
- ఆకాశరామన్న అర్జీలు.
- చూ. ఆకాశరామన్న అర్జీలు.
ఆకాశవాణి
- అశరీరవాక్కు.
- మన పురాణాలలో ఏదయినా ఆకాశవాణి చెప్పడం, దానిని వేదవాక్కుగా స్వీకరించడం