పుట:PadabhamdhaParijathamu.djvu/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అరు_____అరు

86

అరు_____అర్చ


అరుణధారలు

  • రక్త ధారలు.
  • "పరులపై గ్రమ్మెడు నరుణధారలు దమ మేని క్రొంగంటులలోనజొచ్చి..." కుమా. 11. 135.

అరుణాంబుధారలు

  • రక్త ధారలు.
  • "తనరు నరుణాంబుధారల ననవరతము దొప్పదోగి." కుమా. 11. 206.

అరుణాంబువులు

  • రక్తము.
  • "నవధాతుజలము లరుణాంబువు లై." కుమా. 5. 157.

అరువుతిక్క

  • ఉంగిడిరోగము. పశువులకు వస్తుంది.
  • బ్రౌను.

అరువు తెరువు

  • దారి తెన్ను. జం.
  • "ఉభయభారతికి సదుత్తరం బిడనినా, డద్వైతమత మిల నరువు తెరువు, లేని దై పోవదే..."
  • శంకరవిజయ కథా. 4. 44.

అరువులు చేయు

  • వారిసంగతీ వీరిసంగతీ మాట్లాడుకుంటూ కాలము గడుపు. ఇది రాయలసీమలో ప్రచురంగా వినవచ్చే పలుకుబడి.
  • "కోడ లేమో కోడి కూసినప్పటినుంచీ ఱెక్కలు విరుచుకుంటూ ఉంటే ఆడబడుచేమో అరువులు చేసుకొంటూ కూర్చుంటుంది." వా.

అరువు లేనిమనిషి

  • ఏది యెలా చేయవలెనో తెలియనివా డనుట.
  • "వాడు ఒట్టి అరువు లేనిమనిషి. వాడేం చేస్తాడు?" వా.

అరులు మరులు

  • వయసు పండింతరువాత తబ్బిబ్బు పడుట.
  • ఇది నేటికీ రాయలసీమలో అలవాటులో ఉన్న పలుకుబడి.
  • "అరవైయేం డ్లయింది పాపం. అరులు మరులు పట్టిపోయి యేదో ఒకటి అంటూ ఉంటాడు. ఆయన మాటల కేమి?" వా.

అర్కట బెట్టుకొను

  • చంక నుంచుకొను.
  • "జనకు డర్కట బెట్టికొనియొక నాడు చని సరోవరతీరమున బాలు నునిచి..." బస. 6. 151 పుట.
  • చూ. అఱకట నిడుకొను.

అర్ఘ్యపణ్యములు వోయు

  • అర్ఘ్య పాద్యము లిచ్చు, రాగానే అతిథికి కాళ్లు కడుగుకొనుటకై నీళ్ళిచ్చు.
  • "అడుగుల కర్ఘ్యపణ్యములు వోయుచును."
  • పండితా. ప్రథ. దీక్షా. పుట. 135.

అర్చ లిచ్చు

  • పూజించు.
  • "భక్తితోడ...తోడ్కొని చని యర్చ లిచ్చి." భార. శాంతి. 6. 564.