పుట:PadabhamdhaParijathamu.djvu/111

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అరి____అరి 85 అరీ____అరు

అరికాలి నవ్వ

 • ప్రయాణేచ్ఛ.
 • ప్రయాణసూచక మగు శకున శాస్త్రప్రవచనము రీత్యా వచ్చినపలుకుబడి.
 • "వాడి కెప్పుడూ అరికాలిలో నవ్వ పెడుతూ ఉంటుంది." వా.

అరిగాపు

 • సామంతరాజు.

అరిగొలుపు

 • ఎక్కిడు, ఎక్కు పెట్టు.
 • "అ మ్మరి గొలిపె మరుడు." కుమా. 5. 36.

అరిగోలు

 • పడవ.

అరిగోరు వెట్టు

 • భాగము పెట్టు.
 • "అట్టె కర్మములకు నరిగోరు వెట్టేము." తాళ్ల. సం. 9. 198.

అరిపడు/

 • అడ్డపడు.
 • "మాకు నిప్పు డరిపడ్డదురాత్ముల.." భాగ. 3. 528.

అరిబోయు

 • ఎక్కు పెట్టు.
 • "ఘనశస్త్రం బరి బోసి యార్చి." జైమి. 5. 13.

అరివెట్టు

 • కప్పము కట్టు.
 • "మన కరివెట్టనిమహిపుడు లేడు." ద్వి. జగ. పు. 202.

అరిషడ్వర్గాలు.

 • కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు.
 • "అరిషడ్వర్గాలు జయిస్తేగానీ యోగి కాలేడు." వా.

అరుగుదెంచు

 • వచ్చు.
 • "స్థితి దప్పి యరుగుదెంచిన భూవిభుని." రుక్మాం. 2. 106.
 • "అల సమృదులాంగకంబు నై యరుగు దెంచు, నన్ని జపరిగ్రహము..." పాండు. 1. 129.
 • "అయోధ్యకు నరుగుదెంచుటయు."
 • రంగ. రా. బాల. పు. 8. పంక్తి. 18.

అరుంధతి

 • పతివ్రత.
 • అరుంధతి మహాపతివ్రత అని ప్రసిద్ధి. అందుపై వచ్చిన మాట.
 • "యామినీకాంతముఖీ! యరుంధతివి కానక నీపయి గానిపోని యీ వింత ఘటించినట్టి..."
 • శుక. 4. 54. ప.

అరుంధతీదర్శనమగు

 • కనబడకపోవు.
 • "ఆమె యెక్కడ కనబడుతుంది? ఆమె దర్శనం మరీ అరుంధతీదర్శనం అయిపోయింది." వా.

అరుణజలం

 • రక్తము.
 • "వినుతారుణ జలనిగళిత ఘనమన." కుమా. 12. 17.