పుట:PadabhamdhaParijathamu.djvu/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అర్ధ____అర్రా

87

అర్రు____అఱ


అర్ధ చంద్రం

  • నఖక్షతం.

అర్ధ చంద్ర ప్రయోగం

  • మెడబట్టి గెంటుట.
  • "నీవు వాళ్ళింటికి వెళ్ళి హెచ్చు తక్కువగా మాట్లాడావా నీకు అర్ధచంద్ర ప్రయోగం తప్పదు. జాగ్రత్త." వా.

అర్ధచంద్రప్రయోగము చేయు

  • మెడబట్టి గెంటు.

అర్ధజరతీ న్యాయం

  • ప్రామాణికం కొంతా, ప్రమాణరహితం కొంతా కలిసి ఉండడం
  • గుడ్డులో సగం పిల్ల పొదగడానికి వదిలి, సగం కూర చేసుకోవడం అసాధ్యం అనుటపై వచ్చిన సంస్కృత న్యాయం.

అర్ధాంతరంలో

  • మధ్యలో, పూర్తి కాక ముందే.
  • "వాడు చేస్తూ చేస్తూ అర్ధాంతరంలో వదిలిపెట్టి పోయినాడు. ఆ పని అంతా నేనే చేసుకోవలసి వచ్చింది." వా.

అర్ధాకలి

  • కడుపు నిండా తిండిలేమి
  • "ఆమె చేత అన్నం తింటే అర్ధాకలితో చావవలసిందే." వా.

అర్రాడు

  • తచ్చాడు.
  • "కాము డర్రాడుచున్నాడు." రాధా. 4. 314.

అర్రుగుత్తిక యగు

  • కంఠాభరణ మగు.
  • "కోమలాంగికి నర్రుగుత్తిక వై యుండి కలకంఠమా కనికరము వలదె." కవిక. 3. 120.

అర్లుమర్లు

  • చూ. అరులుమరులు.

అఱకట నిడుకొను

  • చంక బెట్టుకొను.
  • చూ. అర్కట బెట్టుకొను.
  • "కొడుకు దా నఱకట నిడుకొని వచ్చె." బస. 6 ఆ. 152 పుట.

అఱకాల బెట్టి నేల రాచు

  • వేధించు.
  • "బింకములు కూల నఱకాల బెట్టి నేల రాచకున్నను నాపేరు రాధ కాదు." రాధి. 3. 15.
  • చూ. నేలబెట్టి కాలరాచు.

అఱకాల ముల్లు గొనక

  • ఏమాత్రం శ్రమపడక, నిరపాయంగా.

"అఱకాల ముల్లు గొన కిట, దిరిగి రఘు
స్వామి యేగుదెంచున్ మదిలో,
దరుణీ! వెఱవకు విపినాం, తరమున నిను
విడిచి పోక తగ దిక నాకున్."
                     రామాభ్యు. 5. 172.

అఱకాలు గొను

  • అఱకాలిలో గ్రుచ్చుకొను.
  • "ఒక కొయ్య యఱకాలు గొన్న." పండితా. ప్రథ. పురా. పుట 390.

అఱకాలు తడి కాకుండా

  • నిరపాయముగా, అశ్రమంగా.
  • "ఉదక మిరుదెసల బాయ...పోవగా