పుట:Neti-Kalapu-Kavitvam.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

62

వాఙ్మయ పరిశిష్టభాష్యం -- నేటికాలపుకవిత్వం


17. అనవాప్తమవాప్తవ్యం నతే కించన విద్యతే.
    లోకానుగ్రహ ఏవైకో హేతుస్తే జన్మకర్మణోః.

18. మహిమానం యదుత్కీర్త్య తవ సంప్రియతే వచః,
    శ్రమేణ తదశక్త్యా వా న గుణానామియత్తయా." (రఘు)

1. మొదట విశ్వంసృజించి, పిమ్మట విశ్వంభరించి. తరువాత విశ్వం సంహరిస్తూ త్రివిధరూపాత్ముడైన నీకు నమస్కారం.

2. ఆకాశసంబంధి జలం యేకరసమైనా, దేశదేశంలో రసాంతరాలను పొందినట్లు, నీవు వికారరహితుడవైనా గుణాల్లో భిన్నా వస్థలు పొందుతున్నావు.

3. నీవొకడవై కూడా ఉపాధివశాన ఆయాఅవస్థలను రాగసంయోగంవల్ల స్ఫటికానికి నానాతత్వంవలె, ప్రాప్తిస్తున్నావు.

4. నీవు కొలతకందవుకాని నీవు లోకాలను కొల్చావు. నీకు కోరికలు లేవు కాని కోరికలు తీరుస్తావు. నిన్ను గెల్చేవాండ్లు లేరు. నీకు సర్వత్రజయం. నీవు అవ్యక్తుడవు కాని వ్యక్తం నీవల్లనే కలుగుతున్నది.

5. హృదయంలో వున్న దూరస్థుడవని, తపస్సాధ్యంలేని తపస్వివని. వ్యసనంలేని కరుణాశాలివని. ముదిమిలేని వృద్ధుడవని అంటారు.

6. నీకన్నీ తెలుసును. నిన్నెవ్వరు తెలియరు. నీవు అన్నిటికి కారణం. నీకు నీవు తప్ప వేరేకారణంలేదు. నీవందరికీ