పుట:Neti-Kalapu-Kavitvam.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తత్త్వజిజ్ఞాసాధికరణం

63


ప్రభుడవు. నీకు ప్రభువు లేడు. నీవు ఒక్కడవి అన్ని రూపాలను పొందుతున్నావు.

7. సప్తసామాలు కీర్తించేది నిన్ను. సప్తసముద్రాలు నీకు శయనం, సప్తజిహ్వుడు నీకు ముఖం. సప్తలోకాలకు నీవు సంశ్రయం.

8. నాలుగు పురుషార్థాలనిచ్చేజ్ఞానం, నాలుగు యుగాలుగా వున్నకాలం, నాలుగువర్ణాలతో వున్నలోకం, ఇవన్నీ నాలుగు ముఖాలుగలనీనుండే కలుగుతున్నవి.

9. హృదయంలో జ్యోతిర్మయమై వుండే నిన్ను అభ్యాస నిగృహితమైన మనస్సుతో యోగులు ముక్తికొరకు ధ్యానిస్తారు.

10. పుట్టుకలేనివాడవై పుట్టుతూ క్రియారహితుడవై శత్రుల సంహరిస్తూ నిద్రలో జాగరూకుడవై వుండే నీయథాస్థితి యెవడికి తెలుస్తుంది.

11. శబ్దాది విషయాలను అనుభవించడానికి, దుస్తరతపస్సు తపించడానికి, ప్రజలను రక్షించడానికి, ఉదాసీనంగా వుండడానికి నీవు సమర్థుడవు.

12. గంగాప్రవాహాలు యెన్నివిధాల చీలినా చివరకు అర్థవంలో కలిసేరీతి సిద్దిహేతువులైన మార్గాలు బహుధాభిన్నాలైనా నీలోనే పడుతున్నవి.

13. నీయందు అవేశితచిత్తులై కర్మలను నీకు సమర్పిస్తూ కోరికలు వదలిన యోగులముక్తికి నీవు గతివి.