పుట:Neti-Kalapu-Kavitvam.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

64

వాఙ్మయ పరిశిష్టభాష్యం -- నేటికాలపుకవిత్వం

14. భూమ్యాదిభూతాలవల్ల నీమహిమ ప్రత్యక్షంగా కనబడుతున్నా యిట్లాటి దని తెలుసుకోవీలులేకున్నది. ఇక శబ్దాను మానాలవల్ల సాధ్యుడవైన నిన్ను గురించి యేమన వలెను?

15. స్మరణచేస్తేనేపురుషుణ్ని పవిత్రపరుస్తావు. నిన్ను పూజించడం దర్శించడం మొదలయిన వాటివల్ల ఫలమెంతగొప్పదో యిందువల్లనే తెలుసుకోవచ్చును.

16. సముద్రంలో రత్నాలు, సూర్యుడికిరణాలు చెప్పవీలులేనట్లు నీచరితలుస్తుతించ అలవికాకున్నవి.

17. పొందదగినదియేదీ, నీవు పొందకుండా వుండలేదు. నీవుజన్మిస్తే లోకానుగ్రహమొకటే హేతువై వుంటుంది.

18. నీమహిమను పొగడి. మావాక్కు లు చాలించడం శ్రమవల్లనో అశక్తివల్లనో గాని నీగుణా లింతే నని గాదు.

అని చెప్పి.

ఇతి ప్రసాదయామాసుః తేసురాస్తమధోక్షజం,
భూతార్థవ్యాహృతిః సా హి న స్తుతిః పరమేష్ఠినః.

ఇదంతా ఆపరమేష్ఠికి స్తుతిగాదు. సిద్ధమైవున్న గుణాలను చెప్పడమేనని పూర్వుల విజ్ఞానానికి తన వినతిని "భూత" శబ్దంచేత వ్యంగ్యముఖాన మనకు వినిపిస్తాడు. ఇట్లానే మాఘుడు.

"బహిర్వికారం ప్రకృతేః పృథగ్విదుః
 పురాతనం త్వాం పురుషం పురావిదః" (మాఘ)

అని పెద్దలంటారని పూర్వుల విజ్ఞానానికి వినతిని చూపినాడు కాళిదాసు అజవిలాపసందర్భంలో వశిష్ఠుడిచేత