పుట:Neti-Kalapu-Kavitvam.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


అని యీతీరున హెచ్చుగావున్నవి, ఈహెచ్చే కొత్త. ఈహెచ్చు కావ్యగుణాన్ని హెచ్చిస్తున్నది. కనుక ఈ కావ్యాల్లో కొత్త వున్నదంటాము; అని వాదిస్తారా?

సమాధానం

వివరిస్తాను. ఈహెచ్చు కావ్యగుణమని తేలవలెను. ఇట్లా యెక్కువగా వుండడం దోషమని తెలిసిమనవారు మాని వుండవచ్చును.

వాస్తవంగా ఇది దోషమని పిమ్మట నిర్ణయించబోతున్నాను. ఇది కొత్త అయినా దోషం గనుకను కావ్యవైసిష్ట్యంగుణాలవల్ల యేర్పడవలె గనుకను దొషాలవల్లనే ఆవైశిష్ట్య మేర్పడితే దుష్టకావ్యాలన్నీ ఒక కొత్తకవిత్వమే కావలసివచ్చును గనుకను మీకావ్యవైశిష్ట్యానికి దోషభూతమైన యీ ఆనందల ప్రణయల మధురల దివ్యల హెచ్చుకారణంగా నిల్వనేరదు.

ఆ క్షేపం

అవునయ్యా ఈ కాలపు కృతికర్తలు కటువైన మాటలు లేకుండా రచిస్తారు. ఇది కొత్త అంటాము; అని వాదిస్తారా

సమాధానం

చెప్పుతున్నాను. కటువైనశబ్దాలు లేని రచన చిరకాలంనుండి వున్నది. కొందరు రాజులు అంతఃపురంలో వినబడదగిన భాషను గురించి కొన్ని నియమాలు చేశారని రాజశేఖరుడు కావ్య మీమాంసలో తెలుపుతున్నాడు.

"శ్రూయతే కున్తలేషు సాతవాహనో నామ రాజా తేన ప్రాకృత భాషాత్మక మంతఃపుర ఏవేతి"

"శ్రూయతే మగధేషు శిశునాగో నామ రాజా తేన దురుచ్చారనష్టౌ వర్ణాన్ అపాస్య స్వాంతః పురుఏవ ప్రవర్తితో నియమః టకారాదయ శ్చత్వారో మూధన్యా స్తృతీయవర్జ మూష్మాణ స్త్రయః క్షకారశ్చేతి."