పుట:Neti-Kalapu-Kavitvam.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నూతనత్వాధికరణం

17


మవుతున్నవి. దేశం, కాలం, ప్రకృతి మొదలైన భేధాలవల్ల భావాలూ తద్వ్యంజకమైన శబ్దసందర్బాలూ యెన్ని విధాలనో మారుతవి వీటికన్నిటికిi విముఖుడై మెత్తటిమెత్తటి అర్ధాల మాటలని కూర్చుంటే భావసంకోచం వెగటు. తప్పక పైనబడుతున్న వంటున్నాను. అత్తవారింటిలో యెప్పుడూ మెత్తటి మెత్తటి మాటలే మాట్లాడ వలెననికోరి దూది, పేడ వెన్నపూస అని అత్త వారింటిని అలజడిపాలు చేసిన పరమానందాయ శిష్యుడివలె తప్పక కృతికర్త అకృతార్దుడు కాగలడు ప్రసన్నత్వంగాక తక్కినమాధుర్యం మొదలైనకొన్ని గుణాలకొరకు కొన్ని అక్షరాలను మాత్రమే -- భావస్పోరక మైనశబ్దాలను గాదు -- వదల మన్నఘట్టంలో ఒక్కొక్క సందర్బాన్ని అనుసరించి ఆ అక్షరాలనుసయితం మానవలసిన పనిలేదని

"క్వచిద్గోపస్తు సమతా మార్గాభేద స్వరూపిణీ.
 క్వచిద్వక్త్రాది వైశిష్ట్యా దన్యధా రచనాదయః" |(సాహిత్య)

అని హితం జెప్పిన భారతీయసాహిత్య వేత్తల ఔచిత్య విజ్ఞానం వాస్తవంగాఆరాధ్యమైవున్నది. ఇట్లాటి ఔచిత్య విజ్ఞానంతో వెలసిన వాల్మీకి కాళిదాసాదుల కావ్యాలు ఇష్టగుణసంపన్నమై లోకోత్తరంగా వున్నవి. ఇంతకూ చెప్పదలచిందేమంటే అంతటా మెత్తటిమెత్తటిమాటలతోనే కావ్యంనింపవలె నంటే భావసంకోచం వెగటు, ఆపతితమవుతున్నవని అవి రచయితను అకృతార్ధుణ్ని చేస్తున్నవని అంటున్నాను. లోకంలో సయితం సందర్బానికి తగినట్లు మెత్తమెత్తగా మాట్లాడితే వుచితంగా వున్నదని అనుకొంటాము. కాని అయినదానికీ కానిదానికీ సమయంలో అసమయంలో మెత్తమెత్తటి అర్ధాల మెత్తమెత్తమాటలు వేసి తలతిప్పుతూ మాట్లాడుతూవుంటే అతణ్ని ఆడమాదిరి మనిషి అని పరిహసనీయకోటిలో చేరుస్తాము. అట్లానే కావ్యంసయితం హాస్యాస్పదమవుతుంది. కనుక అంతటా మెత్తమెత్తటి మాటలు నింపడం గుణంగాదని దోష హేతువని మెత్త మెత్తటి అర్ధాల మాటలతో అంతటానిండిన యిప్పటికవిత్వం నూతనమంటే అదిదోషం గనుక గ్రాహ్యంగాదని చెప్పుతున్నాను.