పుట:Neti-Kalapu-Kavitvam.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నూతనత్వాధికరణం

13

"శ్రూయతే చ కువిన్దో నామ రాజా తేన పరుషసంయోగాక్షర వర్జం అన్తఃపుర ఏవేతి."

(కావ్యమీ)

1. కున్తలదేశంలో సాతహహనుడనేరాజు అంతఃపురంలో మాత్రం ప్రాకృతశబ్దాలు తప్పమరి అన్యం మాట్లాడగూడ దని నియమం చేశాడు.

2. మగధదేశంలో శిశునాగు డనేరాజు స్వాంతఃపురంలో మాత్రం ఉచ్చారణకు కటువైన ట. ఠ. డ. ఢ. లను శ. ష. హ. క్ష లను తప్పించి మాట్లాడవలె నని నియమం చేశాడు.

3. శూరసేన దేశంలో కువిందుడనేరాజు అంతఃపురంలో మాత్రం పరుష సంయోగక్షరాలను మాని మాట్లాడవలె నని నియమం చేశాడు.

అని రాజశేఖరుడు చెప్పుతున్నాడు ఇట్లా యీకట్వక్షరరహితమైన పదఘటన ఆడవాండ్ల అంతఃపురంలోనేగాదు కావ్యమార్గంలో గూడా యీకటుశబ్దాలు లేనిమార్గాన్ని బారతీయులు వినిపించారు

"చిత్తద్రవీభావమయో హ్లాదో మాధుర్యముచ్యతే, సంభోగే
 కరుణే విప్రలంభే శాంతేఃధికం క్రమాత్

                                                     

(సాహిత్య)

(చిత్తద్రవీభావమయమైన హ్లాదం మాధుర్యమనేగుణం సంభోగశృంగారంలోను కరుణంలోను విప్రలంభంలోను శాంతంలోను క్రమంగా ఈమాధుర్యమనేగుణం హెచ్చుగా వ్యక్తమవుతుంది.) అని సాహిత్య వేత్తలు చెప్పుతున్నారు. అంతేగాదు ఫలానిఫలాని అక్షరాలుగలపదాల సంఘటనవల్ల యీగుణం సిద్దిస్తుందని కూడా తెలిపినారు.

"మూర్ద్ని వర్గాంత్యవర్ణేన యుక్తాష్టఠడాన్ వినా
 రణౌ లఘూచ తద్వ్యక్తౌ వర్ణా। కారణతాం గతాః"
"అవృత్తి రల్పవృత్తిర్వా మధురా రచనా తధా"

(సాహిత్య)

(ట, ఠ, డ, ఢ,లు తప్ప "కా" మొదలు "మా" వరకు వుండే అక్షరాలు వర్ణాంతర యోగ రహితమైన ర, ణ లు ఈ మాధుర్యమనే గుణాన్ని వ్యక్తం చేస్తవి. రచన సమాసంలేకుండా గాని అల్పసమాసాలతో గాని వుండ