పుట:Neti-Kalapu-Kavitvam.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


వలెను) అని వివరించారు కనుక మీరనే గుణం కొత్తది గాదని దానివల్ల యిప్పటికవిత్వం నూతనమని అనడం అసంగతమంటున్నాను.

ఆక్షేపం

అవునుసరే, యీగుణం పూర్వకాలంలో గూడా వుంటే వుండవచ్చు మేమనేది అదిగాదు.

ఇప్పటి కావ్యాలు

"హృదయ మోహనమై ప్రేమ మృదులమైన
 తావకీన లీలాసుధాదళపుటంబు
 మామకీన ప్రణయభంగ మధుకణాళి
 విడిచెడు విరక్తిభాష్పముల్ విడుచుపోల్కి"
                                                 (తృణకంకణం)
 
"తనగుణ లతలుపూచిన శోభలో యన
      చిరునవ్వు వెన్నెల చెండ్లు విసరఁ
 దన మనోలీలగాంచిన రాగమధువనఁ
     బలుకు బంతులుపూలపాలనీయ"
                                                 (తృణకంకణం)

అని యిట్లా మెత్తమెత్తగా రచిస్తున్నారు.
  
"విశ్వమోహనం మృదులం
 పూలపాలు వెన్నెలచెండ్లు తియ్యములు జింకపడతి"

అని యిట్లాటి మెత్తమెత్త అర్ధంగల మెత్తటిమాటలతో యిప్పటి కావ్యాలున్నవి. ఇట్లాటివి వెనకటి కావ్యాల్లో లేవు. ఇదే నూతనత్వం. అని అంటారా?

సమాధానం.

చెప్పుతున్నాను అది అసంబద్ధం

"సంచారిణి పల్లవినీ లతేవ" (కుమార)
"పుంస్కోకిలో యన్మధురం చుకూజ" (")
"తాంబూలవల్లీ పరిణద్ధపూగా (")