పుట:Neti-Kalapu-Kavitvam.pdf/44

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు

నూతనత్వాదికరణం

"ట్రాయితే చ కునిన్దో నామ రాజా తేన పరుషసంయోగాక్షర వర్ధం అన్త:పుర్ ఏవేతి.'

(కావ్యమీ)

1. తున్తలదేశంలో సాతహహమడనేరాజు అంత:పురంలో మాత్రం ప్రాకృతశబ్దాలు తప్పమరి అన్యం మాట్లాడగూడ దని నియమం చేశాడు.

2. మగధదేశంలో శిశునాగు డనేరాజు స్వాంత:పురంలో మాత్రం ఉచ్చారణకు కటువైన ట.ఠ.డ.ధ. లను శ.ష.హ.క్త లను తప్పించి మాట్లాడవలె నని నియమంచేసాడు.

3. శూరసేన దేశంలో కువిందుడనేరాజు అంత:పురంలో మాత్రం పరుష సంయోగక్షరాలను మాని మాట్లాడవలె నని నియమం చేశాడు.

  అని రాజశేఖరుడు చెప్పుతున్నాడు ఇట్లా యీకట్వక్షరరహితమైన పదఘటన ఆడవాండ్ల అంత:పురంలోనేగాదు కావ్యమార్గంలో గూడా యీ కటుశబ్దాలు లేనిమార్గాన్ని బారతీయులు వినిపించారు

   "చిత్తద్రవీభావమయో హ్లాదో మాదుర్యముచ్యతే, సంభోగే
     కరుణే విప్రలంభే శాంతేజధికం క్రమాత్

(సాహిత్య)

  (చిత్రద్రవీభావమయమైన హ్లాదం మాధుర్యమనే గుణం సంభోగశృంగారంలోను కరుణంలోను విప్రలంభంలోను శాంతంలోను క్రమంగా ఈమాధుర్య మనేగుణం హెచ్చుగా వ్యక్తమవుతుంది.) అని సాహిత్య వేత్తలు చెప్పుతున్నారు. అంతేకాదు ఫలాని ఫలాని అక్షరాలుగలపదాల సంఘటనవల్ల యీగుణం సిద్దిస్తుందని కూడా తెలిపినారు.

"మూర్ద్ని వర్గాంత్యవర్దేన యుక్తాష్టరడాన్ వినా
 రణౌ లఘాచ తద్వ్యక్తో వర్ణా। కారణతాం గతా।"
 "అవృత్తి రల్పవృత్తిర్వా మధురా రచనా తధా"

సాహిత్య

(ట ఠ డ ఢ లు తప్ప "కా" మొదలు "మా" వరకు వుండే అక్షరాలు వర్ణాంతర యోగ రహితమైన ర. ణ. లు ఈ మాధుర్యమనే గుణాన్ని వ్యక్తం చేస్తవి రచన సమాసంలేకుండా గాని అల్పసమాసాలతో గాని వుండ