పుట:Neti-Kalapu-Kavitvam.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీగణేశాయనమః.

వాఙ్మయపరిశిష్టభాష్యం

చిహ్నాధికరణం

పూర్వపక్షం.

అవునయ్యా. నేడు రవీంద్రుడు, మహాత్ముడు, ఇట్లాటి గొప్పవారు ఉద్భవించారు. ఉచ్చదశ మళ్లీవచ్చేటట్లుకనబడుతున్నది. అట్లానే ఆంధ్రదేశంలోగూడా ఈకొత్త పద్యకర్తలు, శుభచిహ్మమని యెందుకనుకోగూడదు అని అంటారా?

సమాధానం

చెప్పుతున్నాను ఆదేశాలమాట నేను చెప్పను. అక్కడి విశ్వవిద్యాలయాల విధానంలో భారతీయసంస్కారం ఇట్లా హీనంగా లేదు. ఆంధ్రదేశంలో అట్లాటి శుభచిహ్నాలకు అవకాశం లేదు. ఇక ముందు కలుగుతుందేమో చెప్పలేను. ఆంధ్రదేశంలో చిరకాలం కిందటనే భారతీయసంస్కారం క్షీణించింది. నన్నయాదులు మనకు ఇచ్చిన భారతాదులు సయితం స్వరూపం గోల్పోయిన వికారాలు నన్నయాదుల భారతం, భాస్కరాదుల రామాయణం భారతరామాయణాల శుష్కాకృతులుగాని భారతరామాయణాలు గావు. ప్రాచీన గ్రంథాల్లో యేపురాణమూ మనకు యథార్థస్వరూపంతో లభించలేదు. నన్నయ తిక్కన యెఱ్ఱాప్రగడ రచించిన భారతకథల సంగ్రహం మూల మహాభారతంయెదుట "అనంతరత్నప్రభవమైన" హిమాలయం ముందు చిల్లరరాళ్ల గుట్టవలె వున్నది.

శ్రీ ఆనందముద్రాలయంవారు ప్రకటించిన శ్రీతేవపెరుమాళ్లయ్య కృతి రామాయణం ఆమూలవాక్యాలతో అక్కడక్కడ కూడివున్నా