పుట:Neti-Kalapu-Kavitvam.pdf/290

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

255

దోషసామ్యాధికరణం

శరణ్యం? ఇట్లా అక్కడా యిక్కడా యేదో అపహరించి విద్యాజాడ్యంతో యెన్నాళ్ళు సంచరిస్తాము? భారతీయ విజ్ఞానోన్మెషోద్యమంలో ఇతరుల అంటే బంగాళీలు మరాఠీలు మొదలైనవరి యొక్క కృషి ఫలాన్ని పిరికిగా సంగ్రహిస్తుండడం తప్ప ఆ ఉద్యమంలో మనము కార్యకర్తలుగా నిల్వవలసిన యొగ్యత మనకు అవసరం గాదా? అని మనను మనము పరిశోధించుకొనడం అవశ్యకమని మనవి చేస్తున్నాను. ఇతర భాషల్లో ఉపాదేయ గ్రంధాలుంటే తర్జుమా చేసి వాజ్మయాన్ని సంపన్నం చేయవచ్చును. కాని ఆ గ్రంధ కర్తల పేరు చెప్పుకుండా వాటిని యెత్తి వ్రాసి ప్రకటించడం అదేవిధ్య అనుకొనడం ఆత్మవంచన విజ్ఞానవంచన లోకశ్రేయోవంచన అవుతున్నవి.

    ఇంతకూ చెప్పదలచిందేమంటే యితరుల రచనలను చూసి పేరు చెప్పకుండా యెత్తి వ్రాసుకొన్నవి అనేకం వున్నవి. నెనిప్పుడు విచారిస్తున్న వచనకుమారి యేకాంతసేవ యెంకిపటలు మొదలైనవి పాశ్చాత్యులనుండి బంగాళీల నుండి పేరు చెప్పకుండా యెత్తి వ్రాసుకొన్నవాట్లో అనుకరించినవాట్లో చేరినా చేరకున్నా వాటి అనౌచిత్యాలు అనౌచిత్యాలు కాకపోవు పులుముడు శబ్దవాచ్యత అయోమ్యత్వం అసంబద్ధల్త అనుచిత చ్చందస్సు వికృతభాష పాత్ర స్పష్ట భావం చేత  ఆత్మ నాయకత్వం చేత కలిగే దృష్టి సంకోచం. చిల్లర శృంగార క్షుద్రత్వం యివి యొక్కదున్నా పాశ్చత్యుల్లో వున్నా బంగాళీలలో వున్నా దోషాలెనంటున్నాను. దొషసామ్యమే నంటున్నాను. ఇవి పాశ్చాత్యులకృతుల్లోగాని బంగాళీ కృతుల్లోగాని మరెక్కడనైనా గాని వున్నట్లు మీకు కనబడితే  అక్కడక్కడల్లా నా విచారణలు వినిపించవలెనని ప్రార్ధిస్దున్నాను. దోషాలెక్కడ వున్నా అని సిద్ధాంతలసత్యాన్ని బాధింపవు

అని శ్రీ. ఉమాకాన్తవిద్యాశేఖరకృతిలొ వాజ్మయప

       శిష్టంలో దోష సామ్యాధికరణం  సమాప్తం