పుట:Neti-Kalapu-Kavitvam.pdf/291

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


శ్రీ గ ణే శా య న మ:

వాజ్మయపరిశిష్టభాష్యం

చిహ్నాదికరణం

పూర్వపక్షం

   అవునయ్యా నేడు రవీంద్రుడు మహాత్ముడు ఇట్లాటి గొప్పవారు ఉద్భవించాదు. ఉచ్చదశ మళ్లీవచ్చేటట్లుకనబడుతున్నది. అట్లానే ఆంధ్రదేశంలోగూడా ఈ కొత్త పద్యకర్తలు శుభచిహ్మమని యెందుకనుకోగూడదు అని అంటారా?

సమాధానం

    చ్రెప్పుతున్నాను ఆదేశాలమాట నేను చెప్పను. అక్కది విశ్వవిద్యాలయాల విధానంలో భారతీయసంస్కారం ఇట్లా హీనంగా లేదు. ఆంధ్రదేశంలో అట్లాటి శుభచిహ్నాలకు అవకాశం లేదు. ఇక ముందు కలుగుతుందేమో చెప్పలేను. ఆంధ్రదేశంలో చిరకాలమ కిందటనే భారతీయసంస్కారంఒ క్షీణించింది. నన్నయాదులు మనకు ఇచ్చిన భారతాదులు సయితం స్వరూపం గోల్పోయిన వికారాలు నన్నయాదుల భారతం, భాస్కరాదుల రామాయణం భారతరామాయణాలు శుష్ఖాకృతులుగాని భారత్రామాయణాలు గావు. ప్రాచీన గ్రందాల్లో యేపురాణమూ మనకు యదార్ధస్వరూపంతో లభించలేదు. నన్నయ తిక్కన యెఱ్ఱాప్రగడ రచించిన భారతకధలు సంగ్రహం మూల మహాభారతంయెదుట "అనంతరత్నప్రదవమైన" హిమాలయం ముందు చిల్లరరాళ్ల గుట్టవలె వున్నది.
     శ్రీ ఆనందముద్రాలయం వారు ప్రకటించిన శ్రీతేవ పెరుమాళ్లయ్య కృతి రామాయణం ఆమూలవాక్యాలతో అక్కడక్కడ కూడివున్నా