పుట:Neti-Kalapu-Kavitvam.pdf/292

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

257

చిహ్నాధికరణం

మూలంయొక్క యధ్లార్ధస్వరూపాన్ని చాలామట్టుకు చూపుతున్నది. ఇట్లాటిచి స్చల్పసంఖ్యాకాలుమాత్రమే మూలంయొక్క యదార్ద స్వరూపాన్ని ప్రదర్శిస్తున్నవి., గ్రందాల యదార్దస్వరూపం దర్శించినప్పుడే వాటిని మనము చదివిన వారమవుతున్నాము. నన్నయాదులు భారతం చదివినామంటామా? మనము భారతం చదవనివారమే అవుతున్నాము. భాస్కరరాదుల రామాయణం చదివెనామంటామా? మనకురామాయణ స్వరూపం గోచరించనిదే అవుతున్నది. ఇక భారతీయ కావ్యకోటిలో అధమాలనదగిన మనువసుచరిత్రాదులచేత కావ్యవిషయాన ఆంధ్రదేశం వంచితమై నేటికి ఆంధ్రదేశం కధాసంగ్రహాల అధమకావ్యాలదశను దాటలెదు. ఇక ప్రసిద్దభారేతీయ విద్యాస్ధానాలు చిరకాలంకిందనే నశించినవి. మద్రాసు విశ్వవిద్యాలయం వచ్చినప్పటి నుండి పాఠశాలల్లో మనకిరీటం గోల్ఫోయిన పురానకధలే యీఅధమ కావ్యాలే సర్వభారతీయ వాజ్మయం సర్వభారతీయ సంస్కారం అయినవి. సంస్కృతంద్వారా యెవరోకొందరు శిక్షితులైనా అప్రశస్తమైన అభ్యాసమార్గాలవల్ల విద్యాలయాల్లో అనుచితవిద్యాసరణుల వల్ల అశిక్షసయితం దేశంయొక్క సాధారణదశను దాటజాలలేదు. విశ్వవిద్యాలయపు అంధతవల్ల భారతీయసంస్కారం సంపూర్ణంగా విద్యాశాలల్లో కుంఠితమయింది. ఆత్మీయసంస్కారం వున్నప్పుడే పరసంస్కార సమ్మేళనం నూతనడృష్టివికాసాన్ని పరసంస్కారాన్ని ఆత్మీయంచేసుకొనగలశక్తిని సమకూరుస్తుంది. లేదా స్వత్వమేనశించి పరసంస్కారదాస్యం సంభవించి సమకూరుస్తుంది. లేదాస్వత్వమేనశించి పరసంస్కారదాస్యం సంభవించి జాతికి మూలక్షయమే ఫలమవుతున్నది. మన ఆంధ్రదేశంలో విద్యాస్ధానాల్లో భారతీయసంస్కారం నశించిన యీదశల్ మనము గర్వించ దగ్గది యేమీ లేదంటున్నాను. ప్రకృతిని గుడ్దిగాను పురుషుణ్ణికుంటి గాను చిత్రించిన ఒకపటాన్ని బందరులో ఆంధ్రులకళాశాలలో వున్న ఒక బంగళీ గీశాడని అది కొత్తపద్దతిగా బాగావున్నదని ఒకమిత్రుడు నాతో అన్నాడు. అది సాంఖ్యదర్శనంలో ప్రసిద్దవిషయమనియోఖ్ఖాతీ