పుట:Neti-Kalapu-Kavitvam.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

258

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


"పురుషస్య ధర్శనార్ధం కైవల్యార్ధం తథా ప్రధానస్య
 పంగ్వంధవదుభయోరపి సంయోగః తత్‌కృతః సర్గః" (సా. కా)
 "అంధేన పంగుః స్కంధమారోపితః ఏవం శరీరారూఢ
 పఙ్గుదర్శితేన మార్గేణ అంధో యాతి పంగుశ్చ అంధ
 స్కంధారూఢః ఏవం పురుషే దర్శనశక్తిరస్తి పంగు
 వన్న క్రియా ప్రధానే క్రియాశక్తిరస్తి అంధవన్న దర్శనశక్తిః"
                                                        (గౌ. పా)

(పురుషుడు దర్శనార్థం, ప్రధానం కైవల్యార్థం, పరస్పరం కూడుతున్నారు. వీరిద్దరికి కుంటికి గుడ్డికి కలిగినట్లు సంయోగం కలుగుతున్నది. ఈసంయోగంవల్ల యేర్పడ్డది సృష్టి)అని

(అంధుడు కుంటిని బుజమెక్కించుకొన్నాడు. కుంటివాడు చాపిన మార్గాన అంధుడు నడుస్తాడు. అంధుడి బుజమెక్కిన కుంటిగూడా నడిచినవా డవుతున్నాడు. ఇట్లా కుంటికివలె పురుషుడికి దర్శనశక్తివున్నది గాని క్రియాశక్తిలేదు. అంధుడికివలె ప్రధానానికి క్రియాశక్తివున్నది గాని దర్శనశక్తి లేదు.) అని.

ఈశ్వర కృష్ణసాంఖ్య కారికలోను గౌడపాదభాష్యంలోను వున్న సంగతిని తెలిపి భారతీయసంస్కారం ఆంధ్రులకువుంటే యిట్లాటి నూతన చిత్రాలు బంగాళీలకంటె యెక్కువవా చిత్రించగలరన్నాను.

ఇప్పుడు బారతీయవిజ్ఞానం సంస్కృతభాషలోగుప్తమైవున్నది ప్రస్తుతం భారతీయసంస్కారంతో అంటే సంస్కృతంతో యేమత్రమైనా పాఠశాలల్లో కళాశాలల్లో బహువిద్యార్థులకు పరిచయం కలిగించే విద్యాక్రమం అత్యంతం ఆవశ్యకం. ఉదాత్తవాఙ్మయంగల ప్రసిద్ధప్రాచీన బాషల్లో దేనినైనాపాఠశాలలో గాని కళాశాలలోగాని విద్యార్థి చదివి తీరవలెననే యేర్పాటుంటేనేగాని ఆదశ సిద్ధించదు.