పుట:Neti-Kalapu-Kavitvam.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిహ్నాధికరణం

259

మనదేశంలో అట్లాటి శుభచిహ్నాలుగాని సంస్కారోదయ మవుతున్నదనే ఆశగాని లేదంటున్నాను. ఇకముం దేర్పడుతుందేమో చెప్పలేను. బొంబాయి కలకత్తా విశ్వవిద్యాలయాలతో అక్కడి విజ్ఞానోన్మేషంతో ఇక్కడి ఆంధ్రమద్రాసు విశ్వవిద్యాలయాలకు ఇక్కడి సంస్కారదారిద్ర్యానికి సాదృశ్యంలేదు. కనుక మనము మురిసి చంకలు కొట్టుకొనడం అవివేకం, పులుముడు, అయోమయం, చిల్లరశృంగారం, శబ్దవాచ్యత దృష్తిసంకోచం, హీనదశను తెలుపుతున్నవంటున్నాను. ఇట్లాటి క్షుద్రకృతులు బంగాళీలలోవున్నా మరాటీలలో వున్నా హెందీలోవున్నా యెక్కడవున్నా సత్యసిద్ధాంతాలను అతిక్రమించజాలవు. దోషం యెక్కడవున్నా దోషమేగాని గుణంకాదు. పాశ్చాత్యులకు పైనచెప్పినవి గుణమేమోగాని కావ్యప్రస్థానం మహోచ్చదశనందిన భారతీయులకు మాత్రం అవన్నీ దోషాలేనని స్పష్టపరచాను.

అని శ్రీ.. ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో చిహ్నాధికరణం సమాప్తం.