పుట:Neti-Kalapu-Kavitvam.pdf/295

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


శ్రీ గ ణే శా య న మ:

వాజ్మయ పరిశిష్టభాష్యం

బుద్ద్యదికరణం

పూర్వపక్షం

   అవునయ్యా. ఇవి ప్రజాప్రభుత్వపురోజులు యెవరిబుద్దికి తోచిన

ట్లు వాండ్లు వ్రాస్తారు అంటారా?

సమాధానం

      చెప్పుతున్నాను. ప్రజాప్రభుత్వమైనా మరేప్రభుత్వమైనా చదువుకోకుండా వుండడమే ప్రజాప్రభుత్వపు లక్షణమనుకొనడం అనుచితం. ప్రజాప్రభుత్వం ఉచ్చదశలోవున్న దేశాల్లో సయితం విద్యాస్దానాలు ఆచార్యులు విద్యాభ్యాసం ఇవన్నీవున్నవి., వారివారి దేశీయమైన సంస్కారాన్ని వారువారు పొందుతున్నారు. దానికి అనువంగికంగా విదేశీయసంస్కారం పొందుతారు. అట్లానే మన విద్యాస్దానాల్లో భారతీయసంస్కారంపొంది దానికి ఉపోద్బలంగా విదేశీయసంస్కారం గూడాపొంది తరువాత యేమైనా చెప్పండి. పత్రికాప్రవర్తకులుగాండి కృతికర్తలుగాండి చత్రకారులుగాండి యెవరైనా గాండి అప్పుడు ఆకార్యాలు దేశానికి హితమాపాదిస్తవి అని చెప్పుతున్నాను. భారతీయమేమిటి అంటారా? అదియేమో ఇక్కడ తర్కించడానికి అవకాశంలేదు. నాదృష్టిభేదాదికరణంలో పూర్తిగా వివరించాను. అక్కడ చూడవలెనని చెప్పుతున్నాను.
   అని శ్రీ..ఉమాకాన్తవిద్యాశేఖరకృతిలో వాజ్మయసూత్ర
      పరిశిష్టంలో బుద్ద్వధికరణం సమాప్తం