పుట:Neti-Kalapu-Kavitvam.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉపోద్ఘాతాధికరణం

245


తీరుగా యిస్తివాయినం పుచ్చుకొంటి వాయినం అని కృతికర్తలు పొగిడి కొన్ని స్థలాల్లో ఆశ్రయించి తమను పొగిడించుకుంటున్నారు. ఆశ్రయించిన కృతికర్తలను ఉపోద్ఘాతకర్తలు శ్లాఘిస్తున్నారు. లేదా ఆశ్రయించిన దోషానికి వారికండ్ల నీళ్ళు తుడవవలెనని వారిని కొనియాడుతున్నారు. ఈ ఉపోద్ఘాతకర్తలు కృతికర్తల పేరుతో పాటు మా పేరు గూడా కష్టం లేకుండా వ్యాప్తిలోకి వస్తుందని ఉపోద్ఘాతం వ్రాయడమే గొప్ప అనుకొని భువన మోహనలు విశ్వమోహనలు వేసి వ్రాస్తున్నారు. వీరు పొగడడంలో ఒక రిజుట్లో నుంచి ఒకరు వెళ్ళిపోతున్నారు. యెంకి పాటలు ఉపోద్ఘాతకర్త

"కవితా కల్ప ప్రసూనమునందలి"
"కవితాకల్ప ప్రసూన విషయము"
"తేనె వాకలనూరించు"
"దివ్య ప్రసూన రాజములుగాని"
"అమృత ఘటికలు"
"పుష్పరాజములు"
"దివ్య సౌరభ సురభితములై"
"లాలిత్య సౌకుమార్య సౌరభ్యములను వెదజల్లుమంజరులను"
"దివ్య మహిమా విలసితములు. పరిణతీ విలసితములు"

అని శబ్దవాచ్యతాదోషానికి పాలై

"దివ్యమహిమా విలసితములు. పరిణతీ విలసితములు"

అని తప్పులు కూడా వ్రాసి పుష్పాలను వెదజల్లడమే కాకుండా

"ఈ విధములగు దివ్య ప్రసూనముల నర్పించి మనల నానందసాగరమున నోలలాడించుటయును చూడగలిగిన ననుబోటుల జీవితములు ధన్యములు ధన్యములు"