పుట:Neti-Kalapu-Kavitvam.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

246

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


అని పొగడ్తలో చివరి మెట్టెక్కినాడు. కావ్యకుసుమావళి ముఖబంధ కర్తయిన్ని మాటలెందుకు "This is the age of Venkataparvatheeswara Kavulu" ఇది వేంకట పార్వతీశ్వర కవుల సమయం అని యీ కాలాన్నే వేంకటపార్వతీశ్వర కవుల వశంచేశాడు. ఇక యేకాంతసేవ ఉపోద్ఘాతకర్త

"నూతనాంధ్ర సారస్వతములో నిట్టి కావ్యము వేఱొక్కటి లేదని నానమ్మకం" అని అన్నాడు.

"శ్రీనాథుని యఖండ చమత్కృతియే యీ కవి కూడా కలిగి యుండెనని తలచెద."

అని బాపిరాజు తొలకరి పీఠిక వ్రాసిన కూల్ట్రేవారు అన్నారు.

"గుణముననింతకంటే శ్రేష్ఠమైన కృతులు మన భాషలో పెక్కులు లేవు. ఈ మహనీయసృష్టిప్రభావమునకును ప్రకాశమునకును జేరినవారిలో నీ కవులు ముఖ్యముగా గణనీయులు.

ఆర్యాంగ్లేయాది వాఙ్మయముల సారములబీల్చి" అని లక్ష్మీకాంత తొలకరి ఉపొద్ఘాతకర్త రామలింగారెడ్డి వారు పొగడుతున్నారు. కనుక ఇట్లా ఆశ్రయించి పొగిడించుకొన్న పీఠికలు, పీఠికలు వ్రాయుడమనే గొప్పపదవి దొరికింది యింతే చాలునని పీఠికాకర్తలు వ్రాసే పొగడ్తలు విచారించదగ్గవి కావు. గనుక ఈ పీఠికలు అవిచార్యమంటున్నాను. మమ్మిక పొగడుతారు గదా అని కృతికర్తలు పీఠిక వ్రాయడమనే అపూర్వ గౌరవం యిచ్చినందుకు ప్రత్యుపకారంగా స్తుతి చేయవలెనని పీఠికాకర్తలు మీరు పెద్దలంటే మీరు పెద్దలని అన్యోన్యగౌరవము ప్రకటించుకున్న యీ ప్రశంసలు విచార్యం గావు.

కృతికర్తలు ఉపోద్ఘాతకర్తలను ఆశ్రయించి స్తుతిస్తే కృతికర్తల కంటే యెక్కువగా ఉపోద్ఘాతకర్తలు దివ్యలు మధురలు ఆనందలు వేసి పొగడుతున్నారు. ఇవి పాటించదగ్గవి కావంటే