పుట:Neti-Kalapu-Kavitvam.pdf/280

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


245

ఉపోద్ఘాతాధికరణం

తీరుగా యిస్తివాయినం పుచ్చుకొంటి వాయినం అని కృతికర్తలు పొగిడి కొన్ని స్ధలాల్లో ఆశ్రయించి తమను పగిడించుకుంటున్నారు ఆశ్రయించిన కృతికర్తలను ఉపోద్ఘాతకర్తలు శ్లాఘిస్తున్నారు. లేదా ఆశ్రయించిన దోషానికి వారికండ్ల నీళ్ళు తుడవవలెనని వారిని కొనియాడుతున్నారు. ఈ ఉపోద్ఘాతకర్తలు కృతికర్తల పేరుతో పాటు మా పేరు గూడా కష్టం లేకుండా వ్యాప్తిలోకి వస్తుందని ఉపోద్ఘాతం వ్రాయడమే గొప్ప అనుకొని భువన మోహనలు విశ్వమోహనలు వేసి వ్రాస్తున్నారు. వీరు పొగడంలో ఒక రిజుల్లో నుంచి ఒకదు వెళ్ళిపోతున్నాడు. యెంకి పాటలు ఉపోద్ఘాతకర్త

    "కవితా కల్ప ప్రసూనమునందలి"
    "కవితాకల్ప ప్రమాన విషయము"
   "తేనె వాకలనూరించు"
   "దివ్య ప్రసూన రాజములుగాని"
   "అమృత ఘంటికలు"
   "పుష్పరాజములు"
   "దివ్య సౌరభ సురభితములై"
 "లాలిత్య సౌకుమార్య సౌందర్యములను వెదజల్లుమంజరులను"
  "దివ్య మహిమా విలసితములు పరిణతీ విలసితములు"

అని తప్పులు కూడా వ్రాసి పుష్పాలను వెదజల్లడమే కాకుండా
   "ఈ విధములగు దివ్య ప్రమానముల నర్పించిమనల నానంద సాగరమున వోలలాదిఛుటయును చూడగలిగిన వనుకోవటం జీవితములు ధన్యములు ధన్యములు"