పుట:Neti-Kalapu-Kavitvam.pdf/279

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


244

వాజ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం

అప్పారావు బహద్దరు గాని వంశం ఆ చంద్ర తారార్కం నిలువవలెనని ప్రార్దించాడు. అభినవాంద్ర కవి మండలికి తనను గౌరచ్వించినందుకు ఆంధ్ర పండిత మండలికి యెక్కువేశాడు. ఇక ఉపోద్ఘాత రచయితకు నమస్కారాలు ఆగవలసినది లేదుగదా అన్నిటికంటే చిత్రం తపాలా పెట్టె 110 నెంబదు గల జి.యస్. శాస్త్రి అండు కంపెని అనే కంపను యజమానులను శ్రీ గంటి సూర్యనారాయణ శాస్త్రివారిని "తర్క వ్యాకరణ శాస్త్రవేత్తలగు బ్రహ్మశ్రీ గంటి సూర్యనారాయణ శాస్త్రులు గారు తమకు తామై కోరి" అని వ్రాసి చివరన కృతజ్ఞతా సమర్పణం చేశాడు. వీరు తర్క వ్యాకరణ శాస్త్రవేత్తలౌనా కాదా అని విచారణగాదు. అట్లాటి శాస్త్రవేత్తలైతే సంతోషమే మన దేశంలో యెందరు తర్క వ్యాకరణ వేత్తలుంటే అంత శ్రేయ్లస్సుగదా కాని యీ పాటలు అచ్చు వేయించడానికి తర్క వ్యాకరణ శాస్త్రాలకూ యేమీ సంబంధం లెదు. తర్క వ్యాకరణ శాస్త్రవేత్తలుగూడా ఈ పాటలను మెచ్చుకొన్నారు. అని తనను తాను పొగడు కొనడం ఉద్దేశంగా కనబడుతున్నది. అదే నిజమయితే ఆ వుద్దేశ్యం వ్యర్ధం యెందుకంటే కావ్య సౌందర్యం తర్కానికి గాని వ్యాకరణానికి గాని సంబంధించింది గాదు అందుకే

  "నైనం వ్యాకరణజ్జమేతి వితరం న భ్రాతరం తార్కికం"
   (కావ్యకన్య తండ్రి అని వైయకరణుడ్నీ అన్నయ్య అని తార్కికుణ్నీ సమీపించదు)అని బిల్హణుడన్నాడు.

     "శబ్దార్ద శాసనజ్ఞాన మత్రేణైన న వేద్యతే
     వేద్యతే సహి కావ్యార్దతత్వజ్మై లెవ కెవలం"

    (వ్యాకరణ్ం తర్కం చదివితే కావ్య జీవిత స్వరూపం తెలియదు. అయితే కావ్యార్ధ తత్వజ్నులే దాన్ని కనుగోగలరు) అని ఆనంద వర్ధనుడు చెప్పుతున్నాడు. కాని యీ ఔచిత్య జ్ఞానమంతా కోల్పోయి తన సంతోషాన్ని పట్టలేక తర్క వ్యాకరన శాస్త్రవేత్తలు అన్ పొగడినారు. ఈ