పుట:Neti-Kalapu-Kavitvam.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

244

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


అప్పారావు బహద్దరు గారి వంశం ఆ చంద్ర తారార్కం నిలవవలెనని ప్రార్థించాడు. అభినవాంధ్ర కవి మండలికి తనను గౌరవించినందుకు ఆంధ్ర పండిత మండలికి యొక్కువేశాడు. ఇక ఉపోద్ఘాత రచయితకు నమస్కారాలు ఆగవలసినది లేదుగదా. అన్నిటికంటే చిత్రం తపాలా పెట్టె 110 నెంబరు గల జి.యన్. శాస్త్రి అండు కంపెని అనే కంపెని యజమానులను శ్రీ గంటి సూర్యనారాయణ శాస్త్రివారిని "తర్క వ్యాకరణ శాస్త్రవేత్తలగు బ్రహ్మశ్రీ గంటి సూర్యనారాయణ శాస్త్రులు గారు తమకు తామై కోరి" అని వ్రాసి చివరన కృతజ్ఞతా సమర్పణం చేశాడు. వీరు తర్క వ్యాకరణ శాస్త్రవేత్తలౌనా కాదా? అని నా విచారణగాదు. అట్లాటి శాస్త్రవేత్తలైతే సంతోషమే. మన దేశంలో యెందరు తర్క వ్యాకరణ వేత్తలుంటే అంత శ్రేయస్సుగదా. కాని యీ పాటలు అచ్చు వేయించడానికీ తర్క వ్యాకరణ శాస్త్రాలకూ యేమీ సంబంధం లేదు. తర్క వ్యాకరణ శాస్త్రవేత్తలు గూడా ఈ పాటలను మెచ్చుకొన్నారు అని తనను తాను పొగడు కొనడం ఉద్దేశంగా కనబడుతున్నది. అదే నిజమయితే ఆ వుద్దేశ్యం వ్యర్ధం. యెందుకంటే కావ్య సౌందర్యం తర్కానికి గాని వ్యాకరణానికి గాని సంబంధించింది గాదు అందుకే

"నైనం వ్యాకరణజ్ఞమేతి పితరం న భ్రాతరం తార్కికం."

(కావ్యకన్య తండ్రి అని వైయాకరణుడ్నీ అన్నయ్య అని తార్కికుణ్నీ సమీపించదు)అని బిల్హణుడన్నాడు.

"శబ్దార్థ శాసనజ్ఞాన మత్రేణైవ న వేద్యతే
 వేద్యతే సహి కావ్యార్థతత్వజ్ఞై రేవ కేవలం"

(వ్యాకరణం, తర్కం, చదివితే కావ్య జీవిత స్వరూపం తెలియదు. అయితే కావ్యార్థ తత్వజ్ఞులే దాన్ని కనుగోగలరు) అని ఆనంద వర్ధనుడు చెప్పుతున్నాడు. కాని యీ ఔచిత్య జ్ఞానమంతా కోల్పోయి తన సంతోషాన్ని పట్టలేక తర్క వ్యాకరణ శాస్త్రవేత్తలు అని పొగడినారు. ఈ