పుట:Neti-Kalapu-Kavitvam.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీగణేశాయనమః.

వాఙ్మయ పరిశిష్టభాష్యం

ఉపోద్ఘాతాధికరణం

పూర్వపక్షం

అవునయ్యా. యెంకిపాటలను కృష్ణపక్షాన్ని, యేకాంతసేవ మొదలైనవాటిని వాటి ఉపోద్ఘాతకర్తలు ప్రశంసించారు. కనుక అవి ప్రశస్తమైనవి అని అంటారా?

తటస్థాక్షేపం

ఈ తీరుగా విదితమవుతున్నది. ఈ ఉపోద్ఘాతాలే అప్రశస్తాలు. విషయ విమర్శం చేసే ఉపోద్ఘాతాలు కూడవని కాదు. కాని యివి వేరు మార్గపువి అయివున్నవి. కనుక అప్రశస్తాలన్నాను. ఆ సంగతి వివరిస్తాను. పూర్వ కాలంలో కొందరు కృతివ్రాస్తే రాజులను ఆశ్రయించి ధనం సంపాదించే వాండ్లు. ఈ కాలపు కృతికర్తలు ఉపోద్ఘాత కర్తలను ఆశ్రయించి కీర్తి సంపాదించ యత్నిస్తున్నారు. దీంట్లో ఒక రిజుట్లోగుండా ఒకరు వెళ్ళిపోతున్నారు. ఒకరు రామలింగారెడ్ది వారిచేత వ్రాయిస్తే మరియొకరు నల్లవాండ్ల కంటే తెల్లవాండ్లైతే బాగుంటుందని పెద్ద యెత్తెత్తి అడివి బాపిరాజు ప్రభృతులవలె తెల్లవారిచేత వ్రాయిస్తున్నారు. కృతికర్తలు పొగడడం నిర్వివాదం యెంకి పాటల కర్తమటుకు యెంకిపాటల కర్త వరుసగా తన పాటలు మొదలు విన్నవారిని, బుజాలు తట్టిన వారిని, తనను పొగడిన అనసూయ, సుజనరంజని, జ్యోతి, సాహితి యీ పత్రికల ప్రవర్తకులను శారదను వరసగా నమస్కారాల పాటతో కీర్తించాడు. పాటలు విన్న శ్రీ శ్రీ శ్రీ రాజా వెంకటాద్రి