పుట:Neti-Kalapu-Kavitvam.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

230

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


వాల్డర్ డబ్లియు గ్రెగ్(Walter W.Gregg)తెలుపుతున్నాడు. యాథార్థ్య మెరగక (Pastoral) పాస్టరల్ అని యేమేమో అకాండతాండవంచేసి కావ్యక్షుద్రత్వానికి అంధులుకావడం ఆంధ్రులసంస్కార దారిద్ర్యాన్నే తెలుపుతున్నది.

ఇట్లా క్షుద్రపాత్రలశృంగారం ప్రతిపదితమాయెనా అది చిల్లర శృంగారకావ్యమౌతుందని నిరూపించాను. అదిగాక అడవులు కొండలు మొదలైన ప్రకృతిశోభలు క్షుద్రలోకంతో సంబద్ధం కా నక్కరలేదని భారతీయులు కవితకు విజ్ఞానానికి ఆరణ్యసీమలే ఆకరంచేసి ఆరాధించారని తెలిపినాను. కనుక యెంకిపాటలు యెంకయ్య చంద్రమ్మపాటలు ఇట్లాటివి చిల్లరశృంగారపు క్షుద్రకావ్యాలని తిరిగి చెప్పుతున్నాను.

అని శ్రీ. ఉమాకాన్తవిద్యా శేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో వనకావ్యాధికరణం సమాప్తం