పుట:Neti-Kalapu-Kavitvam.pdf/264

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


229

వనకావ్యాధికరణం

(కృషీవలులు) ప్రతిపాదితులు కావడానికి యిక్కడ మనం ఒక్కకులానికి మాత్రం సంబందించిన కాపుకన్నెలను స్వీకరించడం అనుచితం. ఇది పశ్చాత్యసరణుల బాహ్యకారాన్ని చూచి చేసే తెలివి తక్కువ పని అంటున్నాను. అవునయ్యా కాపుకన్నెలు పరంపరంగా చేలతో సంబంధించి వున్నారు. ఇప్పటికీ చేలతో సంబందించిన వారితో వారిసంఖ్యేయెక్కువ గనుక కాపుకన్నెలనే తీస్వుకొంటున్నామంటారా? అంటే అనండి.

   కాపుకన్నెలను కాపుబావలను గాని అట్లాటి బ్రహ్మణ్యకన్యాను బ్రాహ్మణబావలనుగాని చిరకాలంనుండి పశువులమందలకు సంబందించిన గొల్లకన్యలను గొల్లబావలను గాని నాయకులను జేసి యెంకిపాటలవలె కావ్యం వ్రాస్తే ఉదాత్తభావోన్మీలనానికి అవకాశం వుండదని ఇది వరకే విశదంచేశాను. పాశ్చాత్యులు సయితం ఈ పాస్టరుల కావ్యాల అప్రధానత్వాన్ని గ్రహించారు.
   "Pastoral relying for its distinctive features upon it accidents rather than the essentials of life failed to justify itself the position of a Philosophy and in so doing exposed itself to the ridicule of the succeeding ages"
   (తన విశిష్టలక్షణాలకు తీవితంయొక్క ప్రధానతత్వంమీద కాకయాదృచ్చికమైన అంశాలమీద ఆధారపడే పాస్టరులు కవిత కళయొక్క ఉత్కృష్ఠ స్వరూపంగా స్వతంత్రస్వరూపంగా, ఉండజాలకపోయింది. రాజమందిరమందలి భోగిగణంయొక్క చిల్లరబొమ్మ అయిన యీకవిత తత్వజిజ్ఞాసాగౌరవాన్ని అహంకృతితో పొందగోరి పిమ్మటి తరాలవారికి యెకగాళికి గురిఅయింది) అని పాష్టరల్ పొయట్రీ & పాస్టరటీ డ్రామా (Pastoral Poetry and Pastoral Drama)  అనే గ్రంధంలో