పుట:Neti-Kalapu-Kavitvam.pdf/266

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


శ్రీ గ ణే శా య న మ:

వాజ్మయపరిశిష్టభాష్యం

నాయకాధికరణం.

ఆక్షేపం.

  అవునయ్యా; యెంకిపాటలవంటి క్షుద్రశృంఘారమన్నారు. ఇక వర్తమానాల్లో యెవరికి ఉదాత్తశృంగారం? ఇప్పటి ఆంధ్రదేశపురాజుల్లో జమీందారుల్లో సాధాణమనుష్యుల్లో కంటె యెక్కువ ధర్మరక్షకత్వం కనబడరు. అందరూ ఒకటే దశలో వున్నారు. ఇక ఉదాత్త నాయకులేరీ? అంటారా?

సమాధానం

 చెప్పుతున్నాను; నాయకుణ్ని నెదుర్కోవలసినపంది కవిది. ఉచిత నాయకుణ్ని సృజింపండి. చేతకాకుంటే వీలులేకుంటే మానండి. వర్తమానంలో యెవరైనా ధర్మకరక్షకులు ఉదాత్తశృంగారనాయకులు కనబడితే స్వీకరించండి. అసలు భారతవర్షంలోనే అనేక శతాబ్దులకిందటనే ఆరంభమయిన ధర్మపతనం నేడు అనేకవిధాల ఆంధ్రదేశంలో నల్దిక్కులా విరివిగాగొచరిస్తున్నది. జాతిస్వతంత్రమై సర్వసమృద్ధమై ధర్మార్ధ కామాలు అకలుషితాలై వర్తిస్తున్న దశలోవలె జాతిపతనమై జీవితం కుళ్లుడుతో వున్న దశలోఉత్తమకవితొదయానికే అనుకూల్యాలుండవు. మన పద్యం సయితం  మురికిలక్షణాలతో వికృతమైవున్నదని పధ్యం వ్రాయడమే కవిత గాదని పద్య్హంవ్రాయడం విద్యగాదని యిదివరకే చెప్పినాను. మనస్సు జాతిసాధారణమైన ఈప్రాతికూల్యభావాన్ని తొలగించుకొని స్వచ్చవికాసాన్ని పొందడం యేఅలోకసామాన్య